ETV Bharat / business

అమెరికా-చైనా చర్చల్లో పురోగతి .. వాణిజ్య యుద్ధం ముగిసేనా!

అమెరికా-చైనా వాణిజ్య చర్చల్లో పటిష్ఠ పురోగతి కనిపిస్తోందని, ఇరుదేశాల మధ్య 'దశలవారీ ఒప్పందం' కుదిరేందుకు మార్గం సుగమమైందని చైనా ఉపప్రధాని లియుహి పేర్కొన్నారు. మేధో సంపత్తి హక్కుల పరిరక్షణ, సాంకేతిక బదిలీ అంశాల్లో భద్రతకు చైనా హామీ ఇవ్వాలని, అమెరికా ఉత్పత్తులకు చైనామార్కెట్​ను తెరవాలని డిమాండ్​ చేస్తున్న శ్వేతసౌధం అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​... తాజా చర్చల ద్వారా ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం సాకారమవుతుందని అభిప్రాయపడ్డారు.

అమెరికా-చైనా చర్చల్లో పురోగతి .. వాణిజ్య యుద్ధం ముగిసేనా!
author img

By

Published : Oct 20, 2019, 6:16 AM IST

Updated : Oct 20, 2019, 7:50 AM IST

అమెరికా-చైనా చర్చల్లో పురోగతి .. వాణిజ్య యుద్ధం ముగిసేనా!

అమెరికా-చైనా వాణిజ్య చర్చల్లో పటిష్ఠ పురోగతి కనిపిస్తోందని, ఇరుదేశాల మధ్య 'దశలవారీ ఒప్పందం' కుదిరేందుకు మార్గం సుగమమైందని చైనా ముఖ్య అనుసంధాన కర్త, ఉపప్రధాని లియుహి తెలిపారు. వాణిజ్య యుద్ధం ముగియడం ఇరుదేశాలకే కాక ప్రపంచానికి కూడా మేలు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ట్రంప్​ డిమాండ్లు ఇవీ..

చైనాతో వాణిజ్య యుద్ధానికి గతేడాది తెరలేపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. అయితే ఈనెల​ 11న జరిగిన 13వ రౌండ్ వాణిజ్య చర్చల తరువాత ఈ అంశంపై ఒక ఒప్పందం చేసుకునే దిశగా ఇరుదేశాలు అడుగులేస్తున్నట్లు ట్రంప్​ తెలిపారు.

" మేధో సంపత్తి హక్కులు (ఐపీఆర్), సాంకేతిక బదిలీని పరిరక్షించడానికి డ్రాగన్​ వాగ్దానం చేయాలి. అలాగే చైనా వాణిజ్యలోటు తగ్గించే దిశగా ఆ దేశ మార్కెట్​లోకి అమెరికా ఉత్పత్తులను ఎక్కువగా ప్రవేశపెట్టేందుకు అవకాశం కల్పించాలి. తాజా ఒప్పందం కుదుర్చుకోవడానికి 3 నుంచి 5 వారాలు పడుతుంది. మొదటి ఒప్పందం కుదర్చుకున్న వెంటనే రెండో దశ పనులు ప్రారంభమవుతాయి. ఈ ఒప్పందాన్ని తనతోపాటు చైనా అధ్యక్షుడు జిన్​పింగ్ ఆమోదించవచ్చు."
- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

మరోవైపు... మొదటి దశ ఒప్పందంలో భాగంగా అమెరికా ఉత్పత్తుల కోసం చైనా ఆర్థిక సేవల మార్కెట్​ను మరింతగా తెరుస్తామని, సాంకేతిక బదిలీ సమస్యకు రెండో దశలో పరిష్కారం జరుగుతుందని చైనా ఆర్థికమంత్రిత్వశాఖ తెలిపింది.

దిగొచ్చిన చైనా

13వ రౌండ్​ చర్చలకు ముందు ఆమెరికాతో వాణిజ్య లోటును పరిష్కరించడానికి పెద్ద మొత్తంలో యూఎస్​ వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలును వేగవంతం చేసింది బీజింగ్.

చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి జెంగ్ ​షువాంగ్ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం... ఈ ఏడాది చైనా కంపెనీలు అమెరికా నుంచి 20 మిలియన్​ టన్నుల సోయాబిన్, 700 వేల టన్నుల పందిమాంసం, 700 వేల టన్నుల జొన్న, 230 వేల టన్నుల గోధుమలు, 320 వేల టన్నుల పత్తిని కొనుగోలు చేశాయి.​ దీనితో పాటు మరిన్ని అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు కొనసాగిస్తామని జెంగ్​ షువాంగ్ స్పష్టం చేశారు.

చైనా-అమెరికాలు సమానత్వం, పరస్పర గౌరవం ఆధారంగా ఒకరి సమస్యలు మరొకరు పరిష్కరించుకోవడానికి కలిసి పనిచేస్తాయని లియు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: బ్రెగ్జిట్​: బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​కు ఎదురుదెబ్బ

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Selhurst Park, London, England, UK. 19th October 2019.
1. 00:00 SOUNDBITE: (English) Pep Guardiola, Manchester City manager:
(about Gabriel Jesus)
++TRANSCRIPTION TO FOLLOW++
2. SOUNDBITE: (English) Pep Guardiola, Manchester City manager:
(asked about an appeal after Kevin De Bruyne was denied a penalty chance)
++TRANSCRIPTION TO FOLLOW++
3. SOUNDBITE: (English) Roy Hodgson, Crystal Palace manager:
(about the game)
++TRANSCRIPTION TO FOLLOW++
4. SOUNDBITE: (English) Roy Hodgson, Crystal Palace manager:
(about Manchester City)
++TRANSCRIPTION TO FOLLOW++
SOURCE: Premier League Productions
DURATION:
STORYLINE:
Reaction after Manchester City won 2-0 at Crystal Palace and cut the gap at the top the Premier League to five points ahead of Liverpool's match at Manchester United on Sunday.
First-half goals by Gabriel Jesus and David Silva - separated by 95 seconds - helped Pep Guardiola's team respond after losing at home to Wolves before the international break.
With a makeshift back four, it easily could have been a tricky game for the visitors.
City lined up with midfielders Fernandinho and Rodri at the heart of defence after Nicolas Otamendi suffered a knock while on international duty with Argentina.
Last Updated : Oct 20, 2019, 7:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.