ETV Bharat / business

టీకాపై భారత ప్రభుత్వంతో చర్చిస్తాం: ఫైజర్

దేశంలో ఫైజర్ టీకాను అందుబాటులోకి తీసుకొచ్చే విషయంపై భారత ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు కట్టుబడి ఉన్నామని ఆ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. భారత్​లో ఉన్న అవకాశాలను అన్వేషిస్తామని తెలిపారు. ఇప్పటికే ఇతర దేశాల ప్రభుత్వాలతో సంప్రదింపులు ప్రారంభించినట్లు చెప్పారు.

Indian govt to make vaccine available in country: Pfizer
భారత్​లో ఫైజర్​ టీకా
author img

By

Published : Dec 3, 2020, 3:11 PM IST

భారత్​లో ఫైజర్ టీకాను అందుబాటులోకి తీసుకొచ్చే అంశంపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ సంస్థ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల ప్రభుత్వాలతో చర్చలు ప్రారంభించినట్లు తెలిపింది.

భారత్​లోనూ టీకాను ప్రవేశపెట్టేందుకు ఉన్న అవకాశాలను అన్వేషించేందుకు ఫైజర్ కట్టుబడి ఉందని సంస్థ ప్రతినిధి వెల్లడించారు. ప్రభుత్వాలతో చేసుకున్న ఒప్పందాల ద్వారా మాత్రమే టీకాను సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు.

"ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా దేశాల ప్రభుత్వాలతో ప్రస్తుతం మేం చర్చలు జరుపుతున్నాం. భారత ప్రభుత్వాన్ని సంప్రదించేందుకు, దేశంలో టీకాను అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా అవకాశాల అన్వేషణకు కట్టుబడి ఉన్నాం."

-ఫైజర్ ప్రతినిధి

ఫైజర్, బయోఎన్​టెక్ సంయుక్తంగా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్​ అత్యవసర వినియోగానికి బ్రిటన్​ నియంత్రణ సంస్థ ఎంహెచ్​ఆర్ఏ బుధవారం ఆమోదముద్ర వేసింది. ఈ టీకా 95 శాతానికి పైగా సమర్థత కనబర్చిందని ఫైజర్ ఇదివరకే ప్రకటించింది.

ఇదీ చదవండి- టీకా సరే.. 'ప్రణాళిక' అమలు అంత సులభమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.