ETV Bharat / business

LPG Cylinder Price: గుడ్​ న్యూస్​.. తగ్గిన గ్యాస్ ధర - కమర్షియల్​ గ్యాస్ సిలిండర్​ ధర

LPG Cylinder Price: కమర్షియల్ గ్యాస్ సిలిండర్​ ధర తగ్గింది. 19 కేజీల వాణిజ్య సిలిండర్​ ధర రూ. 102.50 మేర తగ్గించినట్లు చమురు సంస్థలు తెలిపాయి. సవరించిన ధర శనివారం అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నాయి.

LPG Cylinder Price
గ్యాస్
author img

By

Published : Jan 1, 2022, 10:47 AM IST

Updated : Jan 1, 2022, 12:21 PM IST

LPG Cylinder Price: నూతన సంవత్సర వేళ ఇంధన తయారీ సంస్థలు వినియోగదారులకు శుభవార్త చెప్పాయి. వాణిజ్య సిలిండర్ ధరపై భారీ తగ్గింపు ప్రకటించాయి. 19 కేజీల కమర్షియల్‌ సిలిండర్‌పై రూ. 102.50 తగ్గిస్తున్నట్లు తెలిపాయి. ఈ తగ్గింపు నేటి నుంచే అమల్లోకి వస్తున్నట్లు చమురు సంస్థల వర్గాలు వెల్లడించాయి. అయితే గృహ వినియోగ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు.

డిసెంబరు 1న వాణిజ్య సిలిండర్‌ ధరను రూ.100కు పైగా పెంచడంతో దేశ రాజధారి దిల్లీలో ఈ సిలిండర్ ధర ఏకంగా రూ.2,101కు పెరిగింది. 2012-13 తర్వాత కమర్షియల్‌ సిలిండర్‌ రూ.2,200లకు చేరడం మళ్లీ ఇప్పుడే. దీంతో రెస్టారంట్లు, హోటళ్లు, టీ స్టాల్‌ వ్యాపారులపై అదనపు భారం పడింది. ఇప్పుడు ఆ సిలిండర్ల ధరను తగ్గించడంతో వారికి కొంతమేర ఊరట లభించినట్లయింది. తాజా తగ్గింపుతో దిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్‌ ధర రూ.1998.50గా ఉంది. అయితే గృహ అవసరాలను వినియోగించే 14.2కేజీలు, 5కేజీలు, 10కేజీల కాంపోజిట్‌, 5 కేజీల కాంపోజిట్‌ సిలిండర్‌ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు.

ఇటీవల గృహ అవసరాలకు వినియోగించే సబ్సీడీ వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను కూడా భారీగా పెంచిన విషయం తెలిసిందే. దీంతో 14.2కేజీల సిలిండర్‌ ధర కూడా రూ.వెయ్యికి చేరువైంది. దిల్లీ, ముంబయిల్లో 14.2 కిలోల సబ్సిడీ వంట గ్యాసు సిలిండర్‌ ధర రూ.899.50గా ఉండగా.. కోల్‌కతాలో రూ.926 పలుకుతోంది. హైదరాబాద్‌లో రూ.950పైనే ఉంది.

ఇదీ చూడండి: కొత్త సంవత్సరం నుంచి ఏటీఎం ఛార్జీల పెంపు

Last Updated : Jan 1, 2022, 12:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.