ETV Bharat / business

రెడ్డీస్​ ల్యాబ్​తో రాక్​వెల్​ కీలక ఒప్పందం - sputnik v

వ్యాక్సిన్​లు భద్రపరిచే ఫ్రీజర్లను అందించేందుకు డాక్టర్​ రెడ్డీస్​ ల్యాబ్​తో ఒప్పందం చేసుకున్నట్లు హైదరాబాద్​కు చెందిన కోల్డ్​చైన్​ ఉత్పత్తుల సంస్థ రాల్​వెల్​ ప్రకటించింది. ఈ తాజా ఒప్పందంతో స్పుత్నిక్​-వి టీకాల తరలింపు, భద్రపరచడంలో ఉన్న సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశముందని రెడ్డీస్​ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

sputnik v
స్పుత్నిక్​-వీ
author img

By

Published : Jun 9, 2021, 7:32 PM IST

ప్రముఖ కోల్డ్​ చైన్​ ఉత్పత్తుల సంస్థ రాక్​వెల్.. వ్యాక్సిన్​లను భద్రపరిచే ఫ్రీజర్లను అందించేందుకు డాక్టర్​ రెడ్డీస్​ ల్యాబ్​తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రకటించింది. తాజా ఒప్పందంతో టీకాల తరలింపు, భద్రపరచటంలో ఉన్న సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉందని రెడ్డీస్​ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. దీంతో స్పుత్నిక్​-వి టీకాను ప్రజలకు అందించేందుకు మార్గం మరింత సుగమవుతుందన్నారు.

స్పుత్నిక్​-వి టీకాలను మైనస్ 18 డిగ్రీల సెల్సియస్ వద్ద భద్రపరచాల్సి ఉంటుంది. అప్పుడే టీకాలు సామర్థ్యాన్ని కోల్పోకుండా ఉంటాయి. దీంతో స్పుత్నిక్ టీకాలను గ్రామీణ ప్రాంతాలకు సరఫరా చేయడం సవాలుగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే స్పుత్నిక్ టీకాలను సురక్షిత ఉష్ణోగ్రతల వద్ద భద్రపరిచేందుకు వీలుగా వ్యాక్సిన్ ఫ్రీజర్లను అందించేందుకు డాక్టర్ రెడ్డీస్​తో ఒప్పందం చేసుకుంది హైదరాబాద్​కు చెందిన రాక్​వెల్​ సంస్థ.

మారుమూల ప్రాంతాలకు సైతం సులభంగా వ్యాక్సిన్​లను తరలించడం సహా దేశవ్యాప్తంగా ఉన్న ఫ్రీజర్లలో రియల్​టైం టెంపరేచర్ల డేటాను ఎప్పటికప్పుడు అందించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఫ్రీజర్లను రూపొందించినట్టు రాక్​వెల్ ప్రకటించింది.

రష్యాకు చెందిన స్పుత్నిక్​-వి వ్యాక్సిన్ల తయారీని భారత్​లో లాంఛనప్రాయంగా ప్రారంభించిన రెడ్డీస్ ల్యాబ్​.. దేశవ్యాప్తంగా జూన్​లోనే టీకాల పంపిణీ చేయనున్నట్టు ప్రకటించింది.

ఇదీ చూడండి:బిట్​కాయిన్​ను చట్టబద్ధం చేసిన తొలి దేశం ఇదే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.