కేఫ్ కాఫీ డే యజమాని వి.జి. సిద్ధార్థ ఆకస్మిక మరణంతో ఆ కంపెనీ షేర్లు కుదేలవుతున్నాయి. వరుసగా రెండో రోజూ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ షేర్లు 20 శాతానికి పైగా పతనమయ్యాయి. మంగళవారమూ షేర్ విలువ 20 శాతంపైగా పతనమైంది.
రెండు రోజుల్లో కంపెనీ మార్కెట్ విలువ రూ.1,463 కోట్లు తగ్గి... రూ.2,603 కోట్లకు పడిపోయింది. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్లో సీసీడీ షేర్ విలువ 52 వారాల కనిష్ఠానికి పడిపోయి రూ.123.25 గా నమోదైంది. ఎన్ఎస్ఈలో 20 శాతం పతనమైన షేర్ విలువ రూ.122.75గా ఉంది.
అదృశ్యమైన కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వి.జి. సిద్ధార్థ మృతదేహం బుధవారం నేత్రావతి నది ఒడ్డున కనిపించింది. ఆయన మరణాన్ని అధికారులు ధ్రువీకరించారు. ఫలితంగా ఆ ప్రభావం సీసీడీ సంస్థపై పడింది.
ఇదీ చూడండి: 'ఫేక్' ఉచ్చులో పడ్డ జనం- 'ఫ్రీ మనీ' కోసం క్యూ