మధ్యతరగతి కుటుంబం(middle class family)లో పుట్టిపెరిగింది చిత్ర. ఎంటెక్ పూర్తిచేసి ఉద్యోగ వేటలో ఉన్నప్పుడే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్(software engineer)వ్యోమ్‌వ్యాస్‌తో పెళ్లయ్యిందామెకు. ఆ వెంటనే ఓ ప్రముఖ సంస్థలో లక్షల రూపాయాల ప్యాకేజీతో ఉద్యోగాన్ని సంపాదించుకుంది. చిత్ర అత్తింటివారంతా వ్యాపారంలో ఉండటంతో తానూ అందులో భాగం అవ్వాలనుకుని ఆ జాబ్‌కి రాజీనామా చేసింది. కొన్నాళ్లకే అందులో మెలకువలు ఒంటపట్టించుకుంది. మార్కెటింగ్‌పై(marketing) పట్టు తెచ్చుకుంది. ఆపై అంటే...2011లో ఎలక్ట్రానిక్ వస్తువులను విక్రయించేందుకు సొంతంగా ‘షాపింగ్ వాపింగ్.ఇన్’(shopping wapping.in) వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.
కొత్త ఆలోచనతో...
మొదట్లో ఈ వ్యాపారం అనుకున్నంత లాభసాటి కాలేదు. అలాగని తానేమీ నిరాశపడలేదు. వినియోగదారుల్ని ఆకట్టుకోవడానికి ఇంకేం దారులున్నాయో ఆలోచించింది. అందులోనే ఫ్యాన్సీ జ్యూయలరీ(fancy jewellery), హ్యాండీక్రాఫ్ట్స్‌లనూ(handicrafts) కలిపి అమ్మడం మొదలుపెట్టింది. ఫ్లిప్‌కార్ట్(flipkart), అమెజాన్(amazon)ల్లోనూ ఈ సైట్‌ద్వారా అమ్మకాలు సాగించింది. మొదట్లో 10 నుంచి 15 ఆర్డర్లు వచ్చేవి. ఏడాదికే ఈ సంఖ్య 100కు పెరిగింది. ఆపై ప్రముఖ బ్రాండ్లైన రిలాక్సో, ఖాదిమ్, లోటో, బాటా, స్పార్క్స్, లిబర్టీ వంటి మరికొన్ని బ్రాండెడ్ షూలను జత చేసింది చిత్ర. ఊహించినట్లుగానే ఆర్డర్లు వెల్లువెత్తాయి. ఒక సమయంలో రోజుకి 1500కు పైగానే ఆర్డర్లు అందుకునేది. క్రమంగా సంస్థ లాభాల బాట పట్టింది.
అవసరాన్ని గుర్తించి...
వ్యాపారం లాభదాయకంగా ఉన్న సమయంలో కొవిడ్ దేశాన్ని తాకింది. లాక్‌డౌన్‌తో అన్నీ స్తంభించిపోయాయి. అలాంటి సమయంలో ఫ్యాషన్ సంబంధిత వస్తువులు కొనేవారి సంఖ్య తగ్గడాన్ని గమనించా. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించా అంటోంది చిత్ర ‘మార్కెట్‌లో నిలబడాలంటే వాస్తవ పరిస్థితులని అర్థం చేసుకోవాలి. నా వ్యాపారం దెబ్బతింది. అయినా వెనకడుగు వేయాలనుకోలేదు. మరోదారికోసం వెతికా. అప్పుడు నాకొచ్చిన ఆలోచనే డ్రైఫ్రూట్స్ అమ్మకం. కరోనా కట్టడికి అవసరమైన వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడానికి వీటి అవసరం ఎంతో అని అర్థమైంది. ఇవన్నీ గమనించాక డ్రైఫ్రూట్స్ విక్రయాలు ప్రారంభించాలనే ఆలోచనను ఇంట్లో చెప్పా. వారు నాపై పూర్తి నమ్మకం ఉంచారు. అయితే ఈసారి వెంటనే ఆ పని మొదలుపెట్టేయలేదు. ముందు ఇవి ఏయే ప్రాంతాల్లో పండుతాయి, నాణ్యమైన రకాలు ఎక్కడ దొరుకుతాయనే విషయంపై ఓ చిన్నపాటి అధ్యయనమే చేశా. ఆయా ప్రాంతాలవారితో మాట్లాడా, కొందరిని వెళ్లి కలిశా. ఇందుకు రెండుమూడు నెలలు పట్టింది.
తర్వాత ‘సాఫ్ట్ ఆర్ట్’ పేరుతో డ్రైఫ్రూట్స్ అమ్మకానికో వెబ్‌సైట్‌ను ప్రారంభించా. నాణ్యత, సమయపాలన పాటిస్తే...చాలు ఖాతాదారులకు నమ్మకం కలిగించినట్లే. ఇందుకోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటా. మహారాష్ట్ర నుంచి కిస్‌మిస్, పలాస నుంచి జీడిపప్పు ఇలా...కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ వివిధ ప్రాంతాల రైతులు, వ్యాపారుల దగ్గర నుంచి, విదేశాల నుంచి దిగుమతి అయ్యేవాటిని ముంబయి వ్యాపారుల నుంచి తెప్పిస్తాం. వాటి నాణ్యతను పరిశీలించి ప్యాక్ చేయిస్తా. ఈ ప్యాకింగ్ అంతా మాన్యువల్‌గానే చేసేవాళ్లం. ఆ తర్వాత ఆర్డర్లు పెరిగేకొద్దీ మిషన్లను కొనుగోలు చేశా. ఇప్పుడు దాదాపు వందమందికి ఉపాధినిస్తున్నాం. పాతికమంది రైతులు, పదుల సంఖ్యలో వ్యాపారులతో కలిసి పనిచేస్తున్నాం. ప్రస్తుతం మా దగ్గర 32 రకాల డ్రైఫ్రూట్స్, నట్స్, సీడ్స్, 15 రకాల స్నాక్స్ అందుబాటులో ఉన్నాయి’ అంటోందామె.
వ్యాపారమన్నాక లాభనష్టాలు సహజమే కానీ...కరోనాతో భిన్నమైన ఇబ్బందులెన్నో ఎదుర్కొన్నా లాక్‌డౌన్‌తో రవాణా ఇక్కట్లు, సిబ్బంది కొరత వేధించేది. ఓసారైతే నేనొక్కదాన్నే వరుసగా మూడు రోజులపాటు నిద్రాహారాలు లేకుండా ప్యాకింగ్ చేశా. మొదట్లో రోజుకి 180 ఆర్డర్లు వచ్చేవి. ఇప్పుడు దేశవ్యాప్తంగా రోజుకి 500 ఆర్డర్లు అందించగలుగుతున్నాం. నెలకు 15వేల ఆర్డర్లు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే విదేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. తక్కువ సమయంలోనే కోట్ల రూపాయల టర్నోవర్‌ని అందుకోగలుగుతున్నా. - చిత్ర
ఇదీ చూడండి: అవరోధాలను అధిగమించింది.. అందరికీ అమ్మయింది!