ETV Bharat / business

'సింగిల్స్​ డే' సేల్స్​లో రికార్డ్​- రూ.10 లక్షల కోట్ల వ్యాపారం!

సింగిల్స్​ డే పేరుతో చైనాలో నిర్వహించే ఆన్​లైన్​ అమ్మకాలు గతేడాదితో (Singles Day 2021) పోలిస్తే సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. ఇప్పటివరకు దాదాపు రూ. 10 లక్షల కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ఆన్​లైన్​ వ్యాపార దిగ్గజం అలీబాబా అత్యధిక విక్రయాలను నమోదు చేసింది.

singles day record
'సింగిల్స్​ డే' సేల్స్​లో రికార్డ్​.. రూ.10 లక్షల కోట్ల అమ్మకాలు!
author img

By

Published : Nov 12, 2021, 12:46 PM IST

చైనాలో 'సింగిల్స్​ డే' పేరుతో నిర్వహించే ఆన్​లైన్​ షాపింగ్ ఈవెంట్​లో (Singles Day 2021) రికార్డ్​ స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయి. తాజాగా జరిగిన ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఈవెంట్‌లో దాదాపు రూ.10 లక్షల కోట్లు (139 బిలియన్‌ డాలర్లు) విలువైన వ్యాపారం జరిగింది. మునుపెన్నడూ లేనంతగా చైనీయులు (Singles Day 2021) షాపింగ్‌ చేసినట్లు వెల్లడైంది.

గతేడాది 'సింగిల్స్​ డే' సందర్భంగా రూ.5 లక్షల కోట్లు (74 బిలియన్​ డాలర్లు) విలువ చేసే అమ్మకాలు జరిగాయి.

ఆలీబాబా రికార్డు..

ఆన్‌లైన్‌ వ్యాపార దిగ్గజం అలీబాబా.. ఈసారి 'సింగిల్స్‌ డే' షాపింగ్‌ బొనాంజా (Singles Day 2021) సందర్భంగా రికార్డు అమ్మకాలను నమోదు చేసింది. సింగిల్స్​ డే సేల్స్​లో మొత్తం రూ.10 లక్షల కోట్ల అమ్మకాలు నమోదైతే.. అందులో రూ.6 లక్షల కోట్ల (84.5 బిలియన్​ డాలర్లు) అమ్మకాలు అలీబాబాకు చెందినవే.

ఏటా ఆ తేదీన...

చైనాలో 2009 నుంచి ఏటా నవంబర్‌ 11వ తేదీన (Singles Day 2021) ఈ మెగా ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. 11వ నెల, 11వ తేదీ కావడం వల్ల 'సింగిల్స్‌ డే' పేరుతో పిలుస్తారు. ఈ సమయంలో కంపెనీలు పలు ఆఫర్లు ప్రకటిస్తుండటం వల్ల ప్రజలు కూడా భారీ స్థాయిలో కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇది కేవలం ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఈవెంట్‌ కాకుండా, చైనా ఆర్థిక వ్యవస్థలో అతి ముఖ్యమైన అంతర్గత చలామణి సమయమని అక్కడి ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడకుండా స్థానిక వినియోగాన్ని పెంచడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలను ఇది తెలియచేస్తోందని అంటున్నారు.

ఇదీ చూడండి : Gold ETF: పసిడి కొందాం.. యూనిట్ల రూపంలో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.