ETV Bharat / business

ఆ భారతీయ ఉత్పత్తుల దిగుమతులపై చైనా నిషేధం

భారత్​ నుంచి పోర్క్​ సహా ఇతర పంది మాంసం ఉత్పత్తుల దిగుమతులపై చైనా నిషేధం విధించింది. ఆఫ్రికన్​ స్వైన్​ ఫ్లూ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.

China bans pork imports from India: Report
ఆ భారతీయ ఉత్పత్తుల దిగుమతులపై చైనా నిషేధం
author img

By

Published : May 29, 2020, 6:21 AM IST

Updated : May 29, 2020, 7:16 AM IST

భారత్​ నుంచి పంది, అడవి పంది సంబంధిత ఉత్పత్తుల దిగుమతులపై చైనా నిషేధం విధించింది. భారత్​లోని పందుల్లో విజృంభిస్తున్న ఆఫ్రికన్​ స్వైన్​ ఫ్లూ(ఏఎస్​ఎఫ్​) కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు చైనా పశుసంరక్షణశాఖ తెలిపింది.

భారత్​-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరుణంలో చైనా నిర్ణయానికి ప్రాధాన్యం సంతరించుకుంది.

దేశీయ, అడవి పందుల్లో ఎస్​ఎఫ్​కు సంబంధించిన తొలి కేసు ఈ నెల తొలి వారంలో అసోంలో నమోదైంది. అయితే ఈ ఏడాది తొలినాళ్లల్లోనే ఏఎస్​ఎఫ్​ రోగ నిరోధక, నియంత్రణ చర్యలు చేపట్టింది చైనా. మంచి ఫలితాలను కూడా రాబట్టగలిగింది. దీంతో పోర్క్​ ధరలు తగ్గుముఖం పట్టాయి. వచ్చే ఏడాదిలోగా ధరలు సాధారణ స్థితికి చేరుకుంటాయని చైనా భావిస్తోంది.

చైనాలోని అధిక జనాభా పోర్క్​ను రోజూ వినియోగిస్తుంది. నిజానికి ఈ ఏఎస్​ఎఫ్​.. 2018 ఆగస్టులో చైనాలోనే పుట్టింది. చైనాలోని ఈశాన్య రాష్ట్రమైన లైయోనిగ్​లో తొలి కేసులు నమోదయ్యాయి.

Last Updated : May 29, 2020, 7:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.