ETV Bharat / business

బడ్జెట్‌ 2021: నిర్మలమ్మ ముందున్న సవాళ్లు! - బడ్జెట్​ ముందున్న సవాళ్లు

కరోనా వైరస్​ వల్ల దేశంలో అన్ని రంగాలు చతికిలబడ్డాయి. మహమ్మారి సృష్టించిన ఆర్థిక సంక్షోభం తర్వాత వస్తున్న బడ్జెట్​ కావటం వల్ల ప్రాధాన్యం సంతరించుకుంది. ఫిబ్రవరి 1న రానున్న పద్దులో ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం కలిగించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఎదురయ్యే సవాళ్లు ఏమిటి?

Challenges ahead of the 2021 budget
బడ్జెట్‌ 2021: నిర్మలమ్మ ముందున్న సవాళ్లు!
author img

By

Published : Jan 24, 2021, 1:32 PM IST

Updated : Jan 24, 2021, 4:42 PM IST

కొవిడ్‌ కారణంగా ఎప్పుడూ లేనంతగా ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతింది. పెద్దఎత్తున ఉద్యోగాలు మాయమయ్యాయి. ప్రజల ఆదాయాలు సైతం పడిపోయాయి. ఏదైనా కొత్త వైరస్‌ పేరు చెబితేనే ప్రజలు వణికిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఒకవైపు ఆర్థిక వ్యవస్థ ఉత్తేజానికి చర్యలు చేపడుతూనే దీర్ఘకాలంగా ఉన్న నిరుద్యోగం, ఆరోగ్య సంరక్షణ వంటి వాటిపై దృష్టిసారించాల్సి ఉంది. ఇంతకీ ఈ సారి బడ్జెట్‌లో ఎదురుకాబోయే కొన్ని ముఖ్యమైన సవాళ్లేంటో పరిశీలిద్దాం..

నిరుద్యోగం

యువ భారత్‌ను ఏళ్లుగా నిరుద్యోగ సమస్య వెంటాడుతోంది. ఎప్పుడూ లేనంతగా నిరుద్యోగం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. దీనికితోడు కొవిడ్‌ వైరస్‌ కత్తి దూయడంతో పెద్దఎత్తున ఉద్యోగాలు పోయాయి. దీంతో తక్షణమే ఉద్యోగాల కల్పనకు పెద్దపీట వేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇందుకోసం మౌలిక సదుపాయాల కల్పన, తయారీ రంగం, రియల్‌ ఎస్టేట్‌ రంగాలకు కేంద్రం విరివిగా ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉంది. అలాగే, దేశంలో ఎక్కువ మంది ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్‌ఎంఈలు కొవిడ్‌ కారణంగా చతికిలపడ్డాయి. ఇవి కోలుకోవాలంటే కేంద్రం చేయూత తప్పనిసరి.

డిమాండ్‌ కొనసాగేనా?

దేశంలో కరోనా అనంతరం ఇప్పుడిప్పుడే ప్రజల కొనుగోళ్లు పెరిగి డిమాండ్‌ ఊపందుకుంది. గత కొన్ని నెలలుగా జీఎస్టీ వసూళ్లు పెరుగుతుండటమే ఇందుకు కొలమానం. అయితే, ప్రజల ఆదాయాలు మునుపటి స్థాయిలో లేని కారణంగా ఈ డిమాండ్‌ ఎంతకాలం కొనసాగుతుందనేది ప్రశ్నే. అయితే, డిమాండ్‌ను పెంచే చర్యలను ఈ బడ్జెట్‌లో చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం కొన్ని రాయితీలు ప్రకటించడం అనివార్యం కానుంది.

శ్లాబ్‌ల మార్పు

బడ్జెట్‌ అనగానే సగటు మనిషి ఎదురుచూసేది ఆదాయపు పన్ను శ్లాబు గురించే. వార్షికాదాయం రూ.5లక్షల వరకు పన్ను మినహాయింపు కల్పించాలన్న డిమాండ్‌ చాలా ఏళ్లుగా ఉంది. అయినా, గత కొన్ని బడ్జెట్‌ల నుంచి ఆ ఊసే లేకుండా పోయింది. ఇటీవల జరిపిన ఓ సర్వేలో బడ్జెట్‌లో 40 శాతం మంది పన్ను ఊరట గురించే ప్రస్తావించడం బట్టి వారి ఆకాంక్షను అర్థం చేసుకోవచ్చు. పైగా కొవిడ్‌ కారణంగా ఆదాయాలు పడిపోయిన నేపథ్యంలో ఈ సారి ఈ డిమాండ్‌ మరింత బలంగా వినిపిస్తోంది. వేతన జీవికి ఊరట కల్పించే ఈ నిర్ణయంపై నిర్మలమ్మ ఏం చేస్తారో చూడాలి మరి!

ఆరోగ్య సంరక్షణ.. తీరు మారేనా?

కొవిడ్‌-19 పుణ్యమా అని మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో లోటుపాట్లు బయటపడ్డాయి. కరోనా విజృంభించిన వేళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు చాలక ఇబ్బందులెదురయ్యాయి. వైద్యసేవల కోసం ప్రైవేటు/ కార్పొరేట్‌ ఆసుపత్రులను ఆశ్రయించిన వారికి ఫీజుల రూపంలో చుక్కలు కనిపించాయి. ఈ పరిస్థితుల్లో ఆరోగ్య సంరక్షణకు కేటాయింపులు పెంచాల్సి ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే ఆరోగ్య సంరక్షణకు మన దేశం వెచ్చిస్తున్న మొత్తం తక్కువగా ఉందనే చెప్పాలి. భవిష్యత్‌లో ఇలాంటి వైరస్‌లు వచ్చే ముప్పును దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను చక్కదిద్దుకోవాలి. జీడీపీలో కనీసం ఈ రంగానికి 2.5 శాతం కేటాయింపులు జరపాలి.

మౌలికం.. కీలకం

దేశంలో యువతకు ఉద్యోగాలను కల్పించాలంటే ప్రజలకు మౌలిక వసతులు కల్పించే ప్రాజెక్టులు పెద్దఎత్తున చేపట్టడం కీలకం. భవిష్యత్‌లో ప్రభుత్వ ఖజానాకు స్థిర ఆదాయం రావాలన్నా, పెద్దఎత్తున ప్రైవేటు పెట్టుబడులు రావాలన్నా ఇందులో ప్రభుత్వ పెట్టుబడులు ముఖ్యం. ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ వంటి వాళ్లు సైతం మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడుల అవసరాన్ని పలుమార్లు ప్రస్తావించారు. దీంతో పాటు ద్రవ్యలోటును అధిగమించడం, ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధించే దిశగా అడుగులు వేయడం వంటి అంశాలు ఈ బడ్జెట్‌లో కీలకం కానున్నాయి. మరి ఈ సవాళ్లను ఎలాంటి పరిష్కార మార్గాలు చూపుతారో చూడాలి మరి!

ఇదీ చదవండి:సీతమ్మా.. రాయితీలివ్వమ్మా: వివిధ రంగాల వినతి

Last Updated : Jan 24, 2021, 4:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.