ETV Bharat / business

10కోట్ల మంది రైతులకు పెట్టుబడి సాయం

ఈ ఏడాది పదికోట్ల మంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్​ నిధి పథకం కింద పెట్టుబడి సాయం అందించనున్నామని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. మరోవైపు 60 ఏళ్లు పైబడిన రైతులకు నెలకు రూ.3 వేలు పింఛను అందించే ప్రధానమంత్రి కిసాన్ మాన్​ధన్​ యోజనకు దేశవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి.

10 కోట్ల అన్నదాతలకు 'పీఎమ్​ కిసాన్' పెట్టుబడిసాయం
author img

By

Published : Aug 9, 2019, 3:54 PM IST

ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి కింద ఈ ఏడాది పదికోట్ల మంది అన్నదాతలకు చేయూత అందించాలని లక్ష్యం నిర్దేశించుకున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్​ తెలిపారు.

రైతులకు ఏడాదికి రూ.6 వేలు పెట్టుబడి సాయంగా అందిస్తున్న పథకమే ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద మూడు విడతల్లో సాయం అందజేస్తుండగా, తొలి విడతలో 5 కోట్ల 88 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. రెండో విడతలో 3 కోట్ల 40 లక్షల మంది రైతులకు సాయం అందినట్లు నరేంద్రసింగ్​ తోమర్​ వెల్లడించారు.

భూమి పరిమాణంతో సంబంధం లేకుండా 14 కోట్ల 50 లక్షల మంది రైతులకు ఈ పథకం వర్తిస్తుందని కేంద్రమంత్రి వివరించారు. బంగాల్​ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలుచేస్తున్నట్లు ఆయన తెలిపారు. పథకం పురోగతి కూడా చాలా బాగుందని ఆయన స్పష్టం చేశారు.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్​ నిధి పథకాన్ని ఆరంభంలో 2 ఎకరాల వరకు భూమి కల్గిన చిన్న, సన్నకారు రైతులకు అమలు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ భూపరిమితిని ఎత్తివేశారు. ఈ పథకం అమలుతో కేంద్ర ఖజానాపై సుమారు 87 వేల కోట్ల రూపాయల భారం పడుతోంది.

ప్రధానమంత్రి కిసాన్​ మాన్​ ధన్​ యోజన

60 ఏళ్లు పైబడిన రైతులకు నెలకు రూ.3 వేలు పింఛను అందించే ప్రధానమంత్రి కిసాన్ మాన్​ ధన్​ యోజనకు దేశవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో కామన్​ సర్వీస్ సెంటర్ల ద్వారా రిజిస్ట్రేషన్లు చేపడతారు.

రెండు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులు. 18 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉన్న రైతులు ఈ పథకంలో చేరవచ్చు. వయస్సును అనుసరించి నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. రైతులు చెల్లించే మొత్తానికి సమాన మొత్తాన్ని ప్రభుత్వం కూడా ప్రీమియంగా చెల్లిస్తుంది.

ఈ పథకం రిజిస్ట్రేషన్​ కోసం కామన్​ సర్వీస్ సెంటర్లు వసూలు చేసే 30 రూపాయల ప్రవేశ రుసుమునూ కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. 60 ఏళ్ల కంటే ముందే రైతు మరణిస్తే అతని భార్య ఈ పథకాన్ని కొనసాగించవచ్చు. 60 ఏళ్ల తరువాత రైతు మరణిస్తే అతని భార్యకు 50 శాతం పింఛను అందుతుంది.

ఇదీ చూడండి: కశ్మీర్​లో పెట్టుబడులకు ప్రోద్బలమిస్తాం: సీఐఐ

AP Video Delivery Log - 0800 GMT News
Friday, 9 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0742: Malaysia Search Prayers AP Clients Only 4224358
Malaysian police pray before searching for UK teen
AP-APTN-0737: Saudi Hajj 2 AP Clients Only 4224356
Prayers in Mecca on first day of Muslim pilgrimage
AP-APTN-0732: SKorea US Defense 2 AP Clients Only 4224354
US Defense Sec visits US troops at SKorea air base
AP-APTN-0719: SKorea Moon Esper No access South Korea 4224352
US Def Sec Esper meets South Korean President Moon
AP-APTN-0712: Taiwan Typhoon Roads No access Taiwan 4224345
Typhoon damages roads in Taiwan
AP-APTN-0708: New Zealand Drugs Bust No Access New Zealand. Part Must Courtesy NWZ Police 4224344
Two Brits arrested after NWZ methamphetamine bust
AP-APTN-0631: China Typhoon No access mainland China 4224343
China: top warning for coastline ahead of typhoon
AP-APTN-0624: Kashmir Troops AP Clients Only 4224342
Armed soldiers on empty streets in Indian Kashmir
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.