ETV Bharat / business

ఆ ఉద్యోగులకు కేంద్రం గుడ్​ న్యూస్​ - ఉద్యోగుల షేర్​ చెల్లించనున్న కేంద్రం

కొవిడ్ సంక్షోభంలో ఉద్యోగం కోల్పోయి.. తిరిగి విధుల్లో చేరిన ఈపీఎఫ్​ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థలో జమ చేసే యాజమాన్యాల, ఉద్యోగుల షేర్​ను ప్రభుత్వమే చెల్లించనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​ తెలిపారు.

nirmala seetha raman
నిర్మలా సీతా రామన్​
author img

By

Published : Aug 21, 2021, 7:39 PM IST

చిన్న పరిశ్రమల్లో పని చేస్తూ.. కరోనా సంక్షోభంలో ఉద్యోగం కోల్పోయి.. తిరిగి విధుల్లో చేరిన వారికి కేంద్రం గుడ్​ న్యూస్​ చెప్పింది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) చందాదారులకు 2022 వరకు ఉద్యోగుల షేర్​తో పాటు, యాజమాన్యాలు చెల్లించే మొత్తాన్ని కూడా ప్రభుత్వమే చెల్లించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ ప్రకటించారు. ఈపీఎఫ్​ఓ కింద నమోదు చేసుకున్న సంస్థల్లో ఉద్యోగం చేసే వారికి మాత్రమే ఈ నిర్ణయం వర్తిస్తుందని పేర్కొన్నారు.

అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు ఓ జిల్లాలో 25 వేలమంది కంటే ఎక్కువగా ఉండి.. సొంతూళ్లు వెళ్లినట్లు అయితే.. వారు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 16 సంక్షేమ పథకాల కింద లబ్ధిపొందుతారని నిర్మలా సీతారామన్​ తెలిపారు. ఇందుకోసం 2020లోనే మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం నిధులను రూ. 60 వేల కోట్ల నుంచి రూ. లక్ష కోట్లకు పెంచినట్లు గుర్తుచేశారు.

ఇదీ చూడండి: RBI: 'ద్రవ్యోల్బణాన్ని పరిశీలిస్తూనే.. వృద్ధికి ఊతమిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.