వస్తు సేవల పన్ను-జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం 44 వేల కోట్లు విడుదల(gst release to states) చేసింది. తద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో(financial year 2020-21).. ఇప్పటివరకూ రాష్ట్రాలకు విడుదల చేసిన మొత్తం లక్షా 59 వేల కోట్లకు చేరిందని.. కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. జీఎస్టీ పరిహారం కింద ఈ ఏడాది జులై 15న 75 వేల కోట్లు, అక్టోబరు 7న 40 వేల కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ (central finance ministry) ప్రకటించింది. గురువారం మరో 44 వేల కోట్లు విడుదల చేసినట్లు పేర్కొంది.
ఈ ఏడాది మే 28న జరిగిన 43వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో(gst council meeting).. కేంద్రమే లక్షా 59 వేల కోట్లు రుణాలు సేకరించి జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు అందించాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన సెక్యూరిటీల(central government securities) ద్వారా.. 44 వేల కోట్లు విడుదల చేసినట్లు ఆర్థికశాఖ వివరించింది. ఇందులో మార్కెట్ నుంచి ఎలాంటి అదనపు రుణసేకరణ జరగలేదని తెలిపింది.
తాజాగా విడుదల చేసిన మొత్తం రాష్ట్రాల్లో ప్రజావసరాలు, ఆరోగ్య వసతులు(health infrastructure), మౌలిక సదుపాయల ప్రాజెక్టులకు(infrastructure projects in india) ఉపకరిస్తుందని కేంద్ర ఆర్థికశాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.
ఇవీ చదవండి: