లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీధి వ్యాపారుల కోసం కేంద్రం సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. వారికి 10వేల రూపాయల వరకు రుణం అందించే వీలు కల్పిస్తూ.. మైక్రో క్రెడిట్ పథకాన్ని ప్రారంభించింది. లాక్‌డౌన్‌తో ప్రభావితమైన వారి జీవనోపాధిని పునఃప్రారంభించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ప్రధాన మంత్రి వీధి ప్యాపారుల కోసం కేటాయించిన 'ఆత్మ నిర్భర్' నిధితో.. దేశంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని 50 లక్షల మంది వీధి వ్యాపారులకు లబ్ది చేకూరుతుందని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది.
ముందుగానే చెల్లిస్తే రాయితీ...
రుణాన్ని సకాలంలో లేదా ముందుగానే తిరిగి చెల్లిస్తే.. సంవత్సరానికి ఏడు శాతం వడ్డీ రాయితీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
ఈ మొత్తాన్ని ఆరు నెలల్లో ప్రత్యక్ష బదిలీ ద్వారా లబ్దిదారుల బ్యాంక్ ఖాతాలకు జమ అవుతుందని స్పష్టం చేశారు. రుణాలను సకాలంలో చెల్లించలేని వారికి ఎటువంటి జరిమానా విధించమని వెల్లడించారు.
వీధి వ్యాపారులు నిర్దిష్ట సమయానికి లేదా అంతకుముందే రుణాలు తిరిగి చెల్లిస్తే.. వారు క్రెడిట్ పరిమితిని పెంచుకోవచ్చు. అప్పుడు రూ.20వేల వంటి అధిక మొత్తంలో లోను పొందేందుకు అర్హులవుతారు.
కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
పట్టణ స్థానిక సంస్థలు ఈ పథకం అమలులో కీలక పాత్ర పోషించనున్నట్లు హెచ్‌యూఏ మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతే కాకుండా ఇందుకోసం వెబ్ పోర్టల్, మొబైల్ యాప్‌తో కూడిన డిజిటల్ ప్లాట్‌ఫాంను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొంది.