ETV Bharat / business

'పశువుల గురించి కూడా కాస్త ఆలోచించండి' - వ్యాపార వార్తలు

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ప్రస్తుతం లాక్​డౌన్​లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పశువుల ఆరోగ్యంపై కూడా దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. ఇందుకోసం పశువైద్యశాలలు, వాటి సిబ్బందికి లాక్​డౌన్​ నుంచి మినహాయింపు ఇవ్వాలని సూచించింది.

Centre asks states to allow veterinary hospitals Except from lockdown
లాక్​డౌన్​ నుంచి పశువైద్యశాలలకు మినహాయింపు ఇవ్వండి
author img

By

Published : Mar 24, 2020, 7:36 PM IST

కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లాక్​డౌన్ అమల్లో ఉంది. ఈ నెలాఖరు వరకు లాక్​డౌన్​ను విధిస్తూ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో పశువుల ఆరోగ్యంపై ఆందోళనలు నెలకొన్నాయి. దీంతో పశువైద్యశాలలకు లాక్​డౌన్​ నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. పశువైద్యశాలలను కూడా అత్యవసర విభాగంలో చేర్చాలని తెలిపింది.

మినహాయింపు ఇచ్చినప్పటికీ పశు వైద్యులు, ఇతర సిబ్బంది వ్యక్తిగత శుభ్రతను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది కేంద్ర పశుసంవర్ధక, పాడి, మత్స్య మంత్రిత్వ శాఖ. సమూహాలుగా తిరగడం చేయొద్దని వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పశువుల ఆరోగ్యం కూడా అత్యవసరమేనని మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది.

ఇదీ చూడండి:'ఐటీ రిటర్ను దాఖలుకు తుది గడువు జూన్​ 30'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.