ETV Bharat / business

అన్ని ఖాతాల‌కు ఒకే కేవైసీ .. సీ-కేవైసీ - సీ కేవైసీ

బ్యాంకు, డీమ్యాట్ ఖాతాలు తెరవాలన్నా, బీమా తీసుకోవాలన్నా కేవైసీ వివరాలు తప్పనిసరి. బ్యాంకుల‌కైతే రిజ‌ర్వుబ్యాంకు, బీమా సంస్థ‌ల‌కు ఐఆర్‌డీఏ, డీమ్యాట్ ఖాతా అంశాల‌కు సెబీ, పింఛ‌న్ సంబంధిత అంశాల‌కు పీఎఫ్ఆర్‌డీఏ నియంత్ర‌ణ‌ సంస్థ‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. అయితే ఖాతాలు తెరిచే ప్ర‌తీసారి కేవైసీ ప‌త్రాల‌ను ఇచ్చే బ‌దులుగా ఖాతాదారుల‌కు సుల‌భంగా ఉండేలా అన్నింటికీ క‌లిపి ఒకే కేవైసీ ఉండాల‌నే ఉద్దేశ్యంతో సీ-కేవైసీ (సెంట్రల్ - కేవైసీ) విధానాన్ని రూపొందించారు.

central KYC
అన్ని ఖాతాల‌కు ఒకే కేవైసీ - సీ-కేవైసీ
author img

By

Published : Jan 7, 2020, 12:01 PM IST

బ్యాంకు ఖాతాను తెరిచేందుకు కేవైసీ ప‌త్రాలను స‌మ‌ర్పించాలి. ఒక్క బ్యాంకు ఖాతా అనే కాదు… డీమ్యాట్ ఖాతా తెర‌వాల‌న్నా, బీమా తీసుకోవాల‌న్నా ఇంకా… అనేక‌ ఆర్ధిక ప‌ర‌మైన అంశాల‌కు కేవైసీ వివ‌రాలు త‌ప్ప‌క ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంకుల‌కైతే రిజ‌ర్వుబ్యాంకు, బీమా సంస్థ‌ల‌కు ఐఆర్‌డీఏ, డీమ్యాట్ ఖాతా అంశాల‌కు సెబీ, పింఛ‌న్ సంబంధిత అంశాల‌కు పీఎఫ్ఆర్‌డీఏ నియంత్ర‌ణ‌ సంస్థ‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ఆయా నియంత్ర‌ణ సంస్థ‌లు జారీచేసిన నిబంధ‌న‌ల ప్ర‌కారం కేవైసీ స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

ఒకే కేవైసీ ఎందుకంటే...

ఖాతాలు తెరిచే ప్ర‌తీసారి కేవైసీ ప‌త్రాల‌ను ఇచ్చే బ‌దులుగా ఖాతాదారుల‌కు సుల‌భంగా ఉండేలా అన్నింటికీ క‌లిపి ఒకే కేవైసీ ఉండాల‌నే ఉద్దేశ్యంతో సీ-కేవైసీ (సెంట్రల్ - కేవైసీ) విధానాన్ని రూపొందించారు. సీ-కేవైసీ వినియోగ‌దారుల కేవైసీ వివ‌రాలు సెంట్ర‌ల్ కేవైసీ రిజిస్ట్ర‌ర్ లో న‌మోదుచేస్తారు.

ప్ర‌తిసారీ ఇవ్వ‌న‌క్క‌ర్లేకుండా...

డీమ్యాట్, బ్యాంకు ఖాతా తెరిచే ప్ర‌తీసారి కేవైసీ వివ‌రాలు ఇవ్వ‌న‌వ‌స‌రం లేదు. స‌ద‌రు ఆర్థిక సంస్థ‌లు వినియోగ‌దారుల కేవైసీ వివ‌రాలు సీ-కేవైసీ రిజిస్ట్ర‌రీ నుంచి పొందుతారు. దీంతో వినియోగ‌దారుల‌ ప‌ని సుల‌భం అవుతుంది.

వివిధ సంస్థల‌కు అందుబాటులో వివ‌రాలు…

ఈ వివ‌రాలు గుర్తింపు ఉన్న ఆర్థిక సంస్థ‌ల‌కు లేదా మ‌నీ లాండ‌రింగ్ చ‌ట్టం ప్ర‌కారం రెగ్యులేట‌రీ సంస్థ‌లు నియ‌మించిన కొన్ని సంస్థ‌ల‌కు అందుబాటులో ఉంటాయి. దీంతో వివిధ ఖాతాల‌కు సంబంధించిన వివ‌రాలు, వ్య‌క్తుల స‌మాచారం ఆయా సంస్థ‌లకు అందుబాటులో ఉంటాయి.

ద‌ర‌ఖాస్తు చేయండిలా...

ఈ స‌దుపాయం పొందేందుకు వినియోగ‌దారులు సీ-కేవైసీ వెబ్‌సైట్ తెర‌చి డౌన్ లోడ్స్ సెక్ష‌న్‌లో ఉన్న‌ ద‌ర‌ఖాస్తును నింపాలి. అందులో తెలిపిన విధంగా పూరించి అవ‌స‌ర‌మైన ప‌త్రాల‌ను అప్ లోడ్ చేయాలి. ఇది మొత్తం ఆన్‌లైన్ లో జ‌రిగే ప్ర‌క్రియ‌. కేవైసీ వివ‌రాల్లో ఏవైనా మార్పులు జ‌రిగితే సీ-కేవైసీ లో వాటిని స‌రిదిద్దే అవ‌కాశం ఉంటుంది. సీ-కేవైసీ ద‌ర‌ఖాస్తును చేసే వ్య‌క్తులు డిజిట‌ల్ సంత‌కాన్ని స్కాన్ చేసి పంపించాలి. నిబంధ‌న‌ల ప్ర‌కారం సంబంధిత ప‌త్రాల‌ను వినియోగ‌దారుడు అప్‌లోడ్ చేయాలి. సీ-కేవైసీ తో క‌లిగే ఇంకో ప్ర‌యోజ‌నం ఏంటంటే వినియోగ‌దారులు త‌నకు అందుబాటులో ఉండే విధంగా ఒక‌టి కంటే ఎక్కువ చిరునామాల‌ను సీ-కేవైసీలో న‌మోదుచేయ‌వ‌చ్చు.

  • సీకేవైసీ ద‌ర‌ఖాస్తు చేసేట‌పుడు క్రింద పేర్కొన్న ప‌త్రాల‌ను స్కానింగ్ తీసి పంపించాలి.
  • 150 - 200 డీపీఐ స్కానింగ్ రిజల్యూష‌న్ తో డాక్యుమెంట్ల‌నును గ్రే స్కేల్లో స్కాన్ చేయాలి.
  • ఇటీవ‌లె తీసిన వినియోగ‌దారుని క‌ల‌ర్ పాస్‌పోర్టు సైజు (200 x 230) పిక్స‌ల్స్, పరిమాణం 20 కేజీ-50 కేబీ మధ్య ఉండాలి.
  • ఆమోదయోగ్యమైన ఫైల్ ఫార్మాట్‌లు: ‘.tif’, ‘.tiff’, ‘.pdf’, ‘.jpeg’, '.jpg’
  • వ్యక్తిగత కేవైసీ రికార్డు కోసం ఫైల్ పరిమాణం గరిష్ట పరిమితి 350 కేబీ.

మార్పులు చేసుకునేందుకు

సీ-కేవైసీలో మార్పులు జ‌రిగితే ఆ కేంద్రం నుంచి ఆర్ధిక సంస్థ‌లకు స‌మాచారం అందుతుంది. వినియోగ‌దారుడు మార్పుకు సంబంధించిన ఆధారాల‌ను అందిస్తే సంస్థ వివ‌రాల‌ను ప‌రిశీలించి మార్పులు చేస్తారు. ఖాతాలో ఏమైనా మార్పులు సంభ‌విస్తే ఉదాహ‌ర‌ణ‌కు మైన‌ర్ ఖాతా నుంచి మేజ‌ర్ ఖాతాకు మారే సంద‌ర్భంలో సంస్థ‌లు వినియోగ‌దారుల‌కు స‌మాచారం అందిస్తాయి. ఆ విధంగా మార్పులు చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

సీ-కేవైసీలో మూడు ర‌కాల ఖాతాలుంటాయి.

  • సాధార‌ణ ఖాతా (నార్మల్ అకౌంట్​): పాన్, ఆధార్, ఓటరు ఐడీ, పాస్‌పోర్టు , డ్రైవింగ్ లైసెన్స్, ఎన్ఆర్‌జీఏ జాబ్ కార్డ్ త‌దిత‌ర ప‌త్రాల్లో ఏదోక‌టి ఇస్తే స‌రిపోతుంది.
  • సింప్లిఫైడ్ ఖాతా (సింప్లిఫైడ్ అకౌంట్​): అద‌న‌పు గుర్తింపు ప‌త్రాలు (ఓవీడీ ) స‌మ‌ర్పించాల్సిన అవ‌స‌రం ఉంటుంది. సుల‌భంగా గుర్తించేందుకు దీన్ని"L" ఈనే అక్ష‌రం తో సూచిస్తారు.
  • చిన్న‌ఖాతా (స్మాల్ అకౌంట్​) : వినియోగ‌దారుని వ్యక్తిగత వివరాలు ఫొటోలు స‌మ‌ర్పిస్తే స‌రిపోతుంది. దీన్ని గుర్తించేందుకు “S” అనే అక్ష‌రం తో సూచిస్తారు.

ప్ర‌త్యేక‌త‌లు:

  • సెంట్రల్ - కేవైసీ రిజిస్ట్రీ వెబ్ పోర్టల్ వినియోగ‌దారుల‌కు సుల‌భంగా అర్థ‌మ‌య్యే రీతిలో ఉంటుంది.
  • సురక్షితంగా ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో కేవైసీ స‌మాచారాన్ని పొందుప‌రిచి ఉంచుతారు.
  • ఆధునిక ప్రామాణీకరణ విధానాలు క‌లిగి భ‌ద్ర‌త‌ను క‌లిగిస్తుంది.
  • స‌మాచారం న‌కిలీ కాకుండా ఉంటుంది. దరఖాస్తుదారుకి ఒకే కేవైసీ గుర్తింపు ఉంటుంది.
  • ఈ విధానంతో నిర్వ‌హ‌ణ వ్య‌యం గ‌ణ‌నీయంగా త‌గ్గుతుంది.
  • కేవైసీ మార్పులు జ‌రిగిన‌ట్ల‌యితే సంస్థలకు వివరాలు నోటిఫికేష‌న్ రూపంలో అందుతాయి.

ఇదీ చూడండి:టాటా - మిస్త్రీ కేసులో 10న సుప్రీం విచారణ

SNTV Digital Daily Planning Update, 0100 GMT
Tuesday 7th January 2020
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
TENNIS: Highlights from the inaugural ATP Cup in Brisbane, Perth and Sydney, Australia. Times TBA.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.