ETV Bharat / business

'విమాన ఛార్జీలపై నియంత్రణ మార్చి చివరకు తొలగిస్తాం'

విమాన ఛార్జీలపై ప్రస్తుతం ఉన్న నియంత్రణను మార్చి ఆఖరులో ప్రభుత్వం తొలగించే అవకాశం ఉందని కేంద్ర పౌరవిమానయాన మంత్రి హర్​దీప్​ సింగ్ పురి వెల్లడించారు. దీంతో ఇంధన ధరలను దృష్టిలో ఉంచుకుని ఛార్జీలపై పరిమితులను తొలగిస్తామని ప్రభుత్వం సంకేతాలు ఇచ్చినట్లు అయింది.

flight charges, aeroplane
'విమాన ఛార్జీలపై నియంత్రణ మార్చి చివరకు తొలగిస్తాం'
author img

By

Published : Feb 20, 2021, 7:38 AM IST

రాబోయే వేసవి కాలంలో దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం విమాన ఛార్జీలపై అమలు చేస్తున్న కనిష్ఠ, గరిష్ఠ పరిమితులు, ఇతర నిబంధనలను మార్చి ఆఖరుకు ప్రభుత్వం తొలగించే అవకాశం ఉందని కేంద్ర పౌరవిమానయాన మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి వెల్లడించారు. విమాన సేవలకు సంబంధించి వేసవి కాలపట్టిక మార్చిలో అమల్లోకి వచ్చి అక్టోబరు వరకు అమల్లో ఉంటుంది.

దేశీయ విమాన రాకపోకలు రోజురోజుకు పెరుగుతున్నాయని, ప్రస్తుతం రోజుకు దాదాపు 3 లక్షల మంది ప్రయాణిస్తున్నట్లు పురి తెలిపారు. కొవిడ్‌-19 రాకముందు రోజువారీ 4-4.5 లక్షల మంది ప్రయాణించేవారు. కొవిడ్‌ లాక్‌డౌన్‌ అనంతరం 2020 మే 25న దేశీయ విమాన సేవలు పునః ప్రారంభించిన సమయంలో ప్రయాణ సమయాన్ని బట్టి ఏడు శ్రేణుల్లో విభజించి, పరిమితులు విధించారు. ఇటీవలే వాటిల్లో మార్పులు చేశారు. పెరిగిన విమాన ఇంధన ధరలను దృష్టిలో ఉంచుకుని ఛార్జీలపై పరిమితులను తొలగిస్తామని ప్రభుత్వం సంకేతాలు ఇచ్చినట్లయ్యింది.

ఇదీ చదవండి : మాదకద్రవ్యాల కేసులో బీజేవైఎం నాయకురాలు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.