ETV Bharat / business

వాహన సంస్థల ప్లాంట్లలో వెంటిలేటర్ల తయారీ! - వ్యాపార వార్తలు

వేగంగా పెరుగుతున్న కరోనా కేసులకు తగ్గట్లు ఆస్పత్రులకు కావాల్సిన పరికరాలు, ఇతర సామాగ్రిపై కేంద్రం దృష్టి సారించింది. ప్రస్తుతమున్న వెంటిలేటర్ల కొరత తీర్చేందుకు వాహన తయారీ సంస్థలు వెంటిలేటర్లు తయారు చేయాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కోరింది. ఇప్పటికే భారత్‌ ఎలక్ట్రానిక్స్..​ వెంటిలేటర్ల తయారీ, డీఆర్‌డీఓకు మాస్క్‌ల తయారీ బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించింది.

Automobile ventilators
వాహన సంస్థల ప్లాంట్లలో వెంటిలేటర్ల తయారీ
author img

By

Published : Mar 30, 2020, 8:36 PM IST

దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వెంటిలేటర్ల సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆటోమొబైల్ తయారీ సంస్థలు తమ వనరులను ఉపయోగించుకుని వెంటిలేటర్లను తయారు చేయాల్సిందిగా కేంద్ర ఆరోగ్యశాఖ కోరింది.

డీఆర్‌డీఓ మాస్క్‌లు..

వచ్చేవారం నుంచి డీఆర్‌డీవో రోజుకు 20,000 ఎన్‌-99 మాస్కులు ఉత్పత్తి చేయనుందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకారం దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో 14వేలకు పైగా వెంటిలేటర్లు, 11.95 లక్షల ఎన్‌-99 మాస్క్‌లు అందుబాటులో ఉన్నాయి. అదనంగా మరో 5 లక్షల మాస్కులను గత రెండు రోజుల్లో పంపిణీ చేశారు. ప్రస్తుతం 3.34 లక్షల మెడికల్ గౌన్లు అందుబాటులో ఉండగా ఏప్రిల్‌4న విదేశాల నుంచి 3 లక్షలు దిగుమతి అవుతాయని వైద్యశాఖ వెల్లడించింది.

బీఈఎల్‌ వెంటిలేటర్లు..

స్థానిక తయారీ సంస్థలతో కలిసి భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌) రెండు నెలల్లో 30,000 వెంటిలేటర్లను తయారు చేయనుందని వైద్యశాఖ తెలిపింది. ప్రైవేటు సంస్థలైన అగ్వా హెల్త్‌కేర్‌ నెలరోజుల్లో 10,000 వెంటిలేటర్లు అందజేస్తుందని పేర్కొంది. దేశీయ తయారీ సంస్థలు రెండు.. రోజుకు 50,000 ఎన్‌-95 మాస్క్‌లు ఉత్పత్తి చేయనున్నాయని వివరించింది.

వచ్చేవారం నుంచి వీటి ఉత్పత్తి రోజుకు లక్ష వరకు పెరగొచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది. మెడికల్ గౌన్ల తయారీకి 11 సంస్థలు అర్హత సాధించగా 21 లక్షల సెట్లను ఆర్డర్‌ ఇచ్చామని తెలిపింది. రోజుకు 6-7వేల చొప్పున వీటిని అందిస్తారని వెల్లడించింది. ఏప్రిల్‌ మధ్య నుంచి ఉత్పత్తి రోజుకు 15 వేలకు పెరుగుతుందని ధీమా వ్యక్తం చేసింది.

ఇదీ చూడండి:రూ.50 లక్షల కరోనా బీమా విధివిధానాలు ఇవే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.