ETV Bharat / business

ఎస్​ బ్యాంకు కుంభకోణంలో ఏడుగురికి లుక్​ అవుట్​ - ఎస్​ బ్యాంకు కుంభకోణం

ఎస్ బ్యాంకు కుంభకోణంలో ఏడుగురికి లుక్​అవుట్​ నోటీసులు జారీ చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ. ఎస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రానా కపూర్​తో పాటు అతని భార్య, కూతుళ్లు, డీహెచ్​ఎఫ్ఎల్ ప్రమోటర్​ కపిల్ వధవాన్​ ఈ జాబితాలో ఉన్నారు.

YES BANK LOC
ఎస్​ బ్యాంకు
author img

By

Published : Mar 9, 2020, 6:45 PM IST

ఎస్​ బ్యాంకు వ్యవస్థాపకుడు రానా కపూర్​కు లుక్​ అవుట్ నోటీసులు జారీ చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ). ఆయనతో పాటు ఎస్ బ్యాంక్​ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కపూర్​ కుటుంబ సభ్యులు, మరికొందరికి.. దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశాలిచ్చింది.

వీరిలో కపూర్​తో పాటు ఆయన భార్య, ఇద్దరు కూతుళ్లు, డీహెచ్​ఎఫ్ఎల్ ప్రమోటర్​ కపిల్ వధవాన్​, ఆర్​కేడబ్ల్యూ డెవలపర్స్​ ప్రమోటర్ ధీరజ్ వధవాన్​ ఉన్నారు. ఇలా మొత్తం ఏడుగురికి లుక్​ అవుట్ జారీ చేసి.. విదేశాలకు వెళ్లకుండా నియంత్రించింది సీబీఐ.

విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన కపూర్ కుమార్తె రోషినిని ఆదివారం ముంబయి విమానాశ్రయంలో నిలిపేశారు అధికారులు.

ఇదీ చూడండి: ఇదీ చూడండి: ఎస్​ బ్యాంక్​ వ్యవస్థాపకుడిపై 'మోసం, అవినీతి' కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.