ETV Bharat / business

కారుకు మళ్లీ 'కరోనా' బ్రేకులు- తగ్గిన విక్రయాలు

author img

By

Published : May 2, 2021, 8:45 AM IST

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్‌ నెలలో కార్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. పెరిగిపోతున్న కరోనా కేసులు సహా.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో లాక్​డౌన్​ తరహా ఆంక్షలు ప్రస్తుత పరిస్థితికి కారణమని పలు సంస్థలు తెలిపాయి.

car sales dropped in april due to rising corona and lockdown restrictions
కారుకు మళ్లీ కరోనా బ్రేకులు

వాహనాల అమ్మకాలకు మళ్లీ కొవిడ్‌-19 సెగ తాకింది. ఏప్రిల్‌లో వాహన విక్రయాలు గణనీయంగా తగ్గాయి. కొవిడ్‌-19 రెండో దశ వ్యాప్తితో కేసుల సంఖ్య విపరీతంగా పెరగడం, వివిధ రాష్ట్రాల్లో పాక్షిక లాక్‌డౌన్‌లు లాంటి ఆంక్షలు విధించడం ఇందుకు కారణమైంది. సాధారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌ అమ్మకాలను గతేడాది ఏప్రిల్‌లో నమోదైన అమ్మకాలతో పోల్చిచూడాల్సి ఉంటుంది. అయితే కిందటేడాది దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించడంతో ఆ నెలలో వాహన కంపెనీలేవీ ఒక్క వాహనాన్ని కూడా విక్రయించలేదు. అందువల్ల అప్పటి అమ్మకాలతో ఇప్పుడు పోల్చిచూడలేమని నిపుణులు అభిప్రాయపడుతున్నాయి.

ఈ ఏడాది మార్చి అమ్మకాలతో పోల్చిచూసినప్పుడు ఏప్రిల్‌లో మారుతీ సుజుకీ మొత్తం అమ్మకాలు 4 శాతం తగ్గాయి. మార్చిలో ఈ వాహన దిగ్గజం 1,67,014 వాహనాలను విక్రయించగా.. కిందటి నెలలో అమ్మకాలు 1,59,691 వాహనాలకు పరిమితమయ్యాయి. దేశీయంగానూ అమ్మకాల్లో 8 శాతం క్షీణత నమోదైంది.

హ్యుందాయ్​ 8, టాటా మోటార్స్​ 41 శాతం క్షీణత..

మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా అమ్మకాలు 8 శాతం తగ్గి 59,203 వాహనాలకు, టాటా మోటార్స్‌ మొత్తం విక్రయాలు 41 శాతం క్షీణతతో 39,530 వాహనాలకు పరిమితమయ్యాయి.

హోండా కార్స్‌ ఇండియా కార్ల అమ్మకాలు 28 శాతం పెరిగి 9,072 వాహనాలుగా నమోదయ్యాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా అమ్మకాలు 10 శాతం తగ్గి 36,437 వాహనాలకు పరిమితమయ్యాయి.

టొయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ 9,622, కియా ఇండియా 16,111, ఎంజీ మోటార్‌ ఇండియా 2,565, వీఈ కమర్షియల్‌ వెహికల్స్ 2,145 చొప్పున ఏప్రిల్‌లో వాహనాలను విక్రయించాయి.

ద్విచక్రవాహనాల కంపెనీల్లో హీరో మోటోకార్ప్‌ 3,72,285 వాహనాలను విక్రయించగా.. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ 53,298 వాహనాల అమ్మకాలను నమోదుచేసింది.

ఇవీ చదవండి: 2025 నాటికి 15 విద్యుత్ కార్లు: టొయోటా

కారు కొనాలనుకుంటున్నారా? ఇవి తెలుసుకోండి..

కియా నుంచి 2022లో మరో మోడల్‌

హ్యూందాయ్​ కార్లపై రూ.1.5 లక్షల వరకు డిస్కౌంట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.