ETV Bharat / business

మౌలిక రంగానికి భారీగా నిధులు- 34.5శాతం పెంపు - ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు 'మౌలిక' వరాలు

మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు కేంద్రం ప్రకటించింది. పెట్టుబడి వ్యయాన్ని 34.5 శాతాన్ని పెంచుతున్నట్లు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సైతం... గత బడ్జెట్​లో ప్రతిపాదించిన వ్యయంతో పోలిస్తే అధికంగా ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది.

mega infrastructure projects in budget to for  the states where assembly elections are to be held soon
మౌలిక రంగానికి భారీగా నిధులు- 34.5 శాతం పెంపు
author img

By

Published : Feb 1, 2021, 12:13 PM IST

అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు మౌలిక సదుపాయాల కల్పనపై బడ్జెట్​లో ప్రధానంగా దృష్టిసారించింది కేంద్రం. 2021-22 సంవత్సరానికి పెట్టుబడి వ్యయాన్ని 34.5 శాతాన్ని పెంచి.. రూ. 5.5 లక్షల కోట్లకు చేర్చుతున్నట్లు ప్రకటించింది.

గత బడ్జెట్​లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన రూ. 4.12 లక్షల కోట్ల పెట్టుబడి వ్యయాన్ని మరింత పెంచనున్నట్లు తెలిపారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ మేరకు 2020-21 బడ్జెట్ అంచనాలను సవరిస్తూ.. ఈ వ్యయాన్ని రూ. 4.39 లక్షల కోట్లకు పెంచిన్నట్లు పేర్కొన్నారు.

"2020-21 పెట్టుబడుల బడ్జెట్ అంచనాలు గణనీయంగా పెరిగాయి. రూ.4.12 లక్షల కోట్లను ఈ(పెట్టుబడి) వ్యయం కోసం ప్రతిపాదించాం. నిధుల కొరత ఉన్నప్పటికీ పెట్టుబడి వ్యయాన్ని అధికం చేయాలని అనుకుంటున్నాం. ఈ ఏడాదిని రూ.4.39 లక్షల కోట్లతో ముగించాలని భావిస్తున్నాం."

-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థికమంత్రి

మరోవైపు, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్​లో పెద్ద పీట వేసింది కేంద్రం. అసోం, తమిళనాడు, బంగాల్, కేరళ రాష్ట్రాల్లో జాతీయ రహదారుల అభివృద్ధి కోసం ప్రాజెక్టులను ప్రకటించింది.

బంగాల్​లో 675 కి.మీ. మేర జాతీయ రహదారుల అభివృద్ధి చేపట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2022 జూన్ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్లను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. ఖరగ్​పుర్, విజయవాడ మధ్య ఈస్ట్​-కోస్ట్ సరకు రవాణా కారిడార్​ను నెలకొల్పనున్నట్లు పేర్కొన్నారు.

మౌలిక వసతుల ఆదాయ వనరుల కోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్​ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ వెల్లడించారు. బ్రౌన్​ఫీల్డ్ మౌలిక ఆస్తుల కోసం నేషనల్ మానెటైసేషన్ పైప్​లైన్​ను ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాని(పీఎల్ఐ)కి అనుబంధంగా మెగా ఇన్​వెస్ట్​మెంట్ టెక్స్​టైల్ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు.

For All Latest Updates

TAGGED:

...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.