ETV Bharat / business

ఆన్​లైన్​లో గంజాయి సరఫరాపై ప్రధానికి సీఏఐటీ లేఖ - CAIT writes letter

అమెజాన్​లో గంజాయి అక్రమ సరఫరాపై భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) ప్రధాని మోదీకి లేఖ రాసింది. ఈ వ్యవహారాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్​)తో విచారణ జరిపించాలని లేఖలో కోరింది.

d
ఆన్​లైన్​లో గంజాయి
author img

By

Published : Nov 19, 2021, 5:40 AM IST

అమెజాన్ ద్వారా 1000కిలోల గంజాయి అక్రమ రవాణా వ్యవహారంపై.. భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) ప్రధాని మోదీకి లేఖ రాసింది. ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్​)తో విచారణ జరిపించాలని లేఖలో పేర్కొన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్​డీఐ), ఫారెన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్​మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనలను అమెజాన్ ఉల్లంఘించిందని లేఖలో వివరించింది సీఏఐటీ.

అయితే ఈ ఘటనపై తమ దృష్టికి రాలేదని.. ఈ వ్యవహారంపై ప్రస్తుతం తాము విచారణ జరుపుతున్నామని అమెజాన్​ ఇటీవలే తెలిపింది.

ఈ కేసుపై వెంటనే సిట్​తో దర్యాప్తు చేపట్టాలని లేఖలో ప్రధాని మోదీని కోరారు సీఏఐటీ సభ్యులు.

ఏం జరిగిందంటే..?

విశాఖపట్నం నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు అమెజాన్ ద్వారా 1000కిలోల గంజాయి అక్రమ రవాణా జరిగిందని మధ్యప్రదేశ్ భిండ్ జిల్లా ఎస్పీ వెల్లడించారు(ganja smuggling news). గుజరాత్​కు చెందిన ఓ కంపెనీ వస్త్ర పరిశ్రమ ముసుగులో ఈ దందా నడుపుతున్నట్లు పేర్కొన్నారు. పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తునట్లు చెప్పారు(ganja smuggling in india).

ఇదీ చూడండి: 'విశాఖ నుంచి అమెజాన్​ ద్వారా 1000కిలోల గంజాయి స్మగ్లింగ్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.