ETV Bharat / business

జైకొవ్​-డి టీకా​ ఉత్పత్తికి శిల్పా మెడికేర్, క్యాడిలా డీల్ - జైకొవ్ డి వ్యాక్సిన్

జైకొవ్-డి వ్యాక్సిన్​ను(Zycov-D vaccine)​ భారీ ఎత్తున ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది ప్రముఖ ఔషధ తయారీ సంస్థ జైడస్ క్యాడిలా(Zydus Cadila Vaccine News). ఈ మేరకు శిల్పా మెడికేర్​తో ఒప్పందం కుదుర్చుకుంది.

zydus cadila
జైడస్ క్యాడిలా
author img

By

Published : Sep 24, 2021, 4:51 PM IST

ప్రముఖ ఔషధ తయారీ సంస్థ క్యాడిలా హెల్త్​ కేర్(Cadila Healthcare) శుక్రవారం శిల్పా మెడికేర్​తో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. తమ సంస్థ అభివృద్ధి చేసిన జైకొవ్-డి(Zycov-D Vaccine) కొవిడ్​ వ్యాక్సిన్​ను శిల్పా మెడికేర్​ ఉత్పత్తి చేయనున్నట్లు పేర్కొంది.

"శిల్పా మెడికేర్​తో ఒప్పందం కుదిరింది. కర్ణాటక ధార్వాడ్​లోని ఇంటిగ్రేటెడ్ బయోలజిక్స్ ఉత్పత్తి కేంద్రంలో శిల్పా బయోలజికల్స్.. జైకొవ్-డి వ్యాక్సిన్ తయారీ ప్రారంభించనుంది. అనంతరం వ్యాక్సిన్ సరఫరా చేయనున్నాం." అని క్యాడిలా హెల్త్​కేర్ తెలిపింది. ఈ మేరకు జైకొవ్-డి టెక్నాలజీని శిల్పా బయోలజికల్స్ ప్రైవేట్ లిమిటెడ్​కు(ఎస్​బీపీఎల్) షేర్​ చేయనున్నట్లు పేర్కొంది.

రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఎస్​బీపీఎల్(Shilpa Medicare News​) వ్యాక్సిన్ తయారీ బాధ్యలు చేపట్టనుంది. ఫిల్లింగ్, ప్యాకేజింగ్, సరఫరా మొదలైనవి క్యాడిలా సంస్థ చూసుకోనుంది.

జైకొవ్‌-డి వ్యాక్సిన్‌(Zycov-D Zydus Cadila) దేశీయ పరిజ్ఞానంతో తయారైన రెండో టీకా. ప్రపంచంలోనే డీఎన్‌ఏ ఆధారంగా రూపొందిన తొలి వ్యాక్సిన్‌ ఇదే కావడం విశేషం. ఈ టీకాను నేరుగా చర్మంలోకి ఎక్కిస్తారు. ఇందుకోసం సూది అవసరం ఉండదు. నొప్పి లేకుండా ఫార్మాజెట్‌ అనే సాధనం ద్వారా దీన్ని ఎక్కిస్తారు. 12-18 ఏళ్ల వారికి కూడా దీన్ని ఇవ్వవచ్చు. ఈ వయసు వారికి దేశంలో అందుబాటులోకి వచ్చిన మొదటి కొవిడ్‌ టీకా ఇదే. ఆగస్టు 20న ఈ వ్యాక్సిన్​కు అత్యవసర వినియోగానికి అనుమతి లభించింది.

ఇదీ చదవండి:

భారత్​లో త్వరలో మరో టీకా- పిల్లలకు కూడా!

Zycov-D Vaccine: సెప్టెంబర్​ నుంచి జైకోవ్​-డి టీకా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.