ETV Bharat / business

'కస్టమ్స్​ అఫెన్స్​' కట్టడికి బ్రిటన్​తో కీలక ఒప్పందం! - కస్టమ్స్​ విభాగంలో నేరాలు

కస్టమ్స్​ పరిధిలోని నేరాలను అరికట్టేందుకు బ్రిటన్​తో కీలక ఒప్పందం చేసుకునేందుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్​ ఆమోదం తేలిపింది.

India, Britain
భారత్​, బ్రిటన్​
author img

By

Published : Apr 28, 2021, 6:28 PM IST

కస్టమ్స్​ అఫెన్సెస్​ను కట్టడి చేయటం, ఇరు దేశాల మధ్య సమాచార మార్పిడికి భారత్​, బ్రిటన్​ మధ్య ఒప్పందం చేసుకునేందుకు ఆమోందం తెలిపింది కేంద్ర మంత్రివర్గం. కస్టమ్స్​ సుంకాల చెల్లింపు, రికార్డుల్లో అవకతవకలు వంటి వాటిని తగ్గించేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని ఓ ప్రకటన చేసింది కేంద్రం.

" ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్​ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కస్టమ్స్​ సహకారం, కస్టమ్స్​ విషయాలలో పరస్పర పరిపాలన సహాయంపై భారత ప్రభుత్వం, బ్రిటన్​, నార్తర్న్​ ఐర్లాండ్​ మధ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని ద్వారా కస్టమ్స్​ నేరాల్లో దర్యాప్తు, కట్టడికి కావాల్సిన సమాచారం లభించనుంది. సులభతర వాణిజ్యానికి దోహదపడనుంది."

- ప్రభుత్వ ప్రకటన

ఇరు దేశాల కస్టమ్స్​ అధికారులకు కావాల్సిన సమాచారం, ఇంటెలిజెన్స్​ను పంచుకునేలా ఈ ఒప్పందం దోహదపడుతుందని తెలిపింది కేంద్రం. కస్టమ్స్​ చట్టాల అమలు, నేరాల కట్టడి, దర్యాప్తునకు మార్గం సుగమమవుతుందని పేర్కొంది.

ఇరు దేశాల కస్టమ్స్​ అధికారుల సమ్మతితో ప్రతిపాదిత ఒప్పందం ముసాయిదాను ఖరారు చేసినట్లు తెలిపింది కేంద్రం.

ఇదీ చూడండి: 'టైమ్​' జాబితాలో రెండు భారతీయ సంస్థలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.