ETV Bharat / business

ఎలక్ట్రిక్ బైక్ కొనాలా? ఈ విషయాలు తెలుసుకోండి.. - ఎంత ధరలో ఎలక్ట్రిక్​ బైక్​ను కొనొచ్చు

ఇంధన ధరలు భారీగా పెరగటం, పర్యావరణంపై ఆందోళనలు సహా పలు ఇతర కారణాల వల్ల.. విద్యుత్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. దీనితో.. ప్రముఖ ద్విచక్రవాహన కంపెనీలన్ని విద్యుత్ వాహనాలను తీసుకొస్తున్నాయి. ఓలా వంటి కంపెనీలు కూడా ఈ మార్కెట్లోకి వస్తున్నాయి. మరి విద్యుత్ బైక్​లను కొనే ముందు ఎలాంటి విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

Tips for Buying Electric Bike
విద్యుత్​ బైక్​ కొనడంలో టిప్స్​
author img

By

Published : Aug 14, 2021, 10:01 AM IST

ద్విచక్ర వాహన కంపెనీలన్నీ ప్రస్తుతం ఎలక్ట్రిక్ బైక్, స్కూటర్లను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాయి. కొన్ని కంపెనీలు తమ విద్యుత్​ బైక్​లను ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేశాయి. వీటికి డిమాండ్ కూడా బాగున్నట్లు షోరూంల డీలర్లు చెబుతున్నారు. భవిష్యత్​లో ఇది ఇంకా పెరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్​ రేట్లు భారీగా పెరగటం కూడా ఈ డిమాండ్​ పెరిగేందుకు కారణంగా చెప్పొచ్చు.

మరి ఎలక్ట్రిక్ స్కూటర్, బైక్​లను కొనుగోలు చేసే ముందు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు ఏమిటి? అనే విషయంపై నిపుణుల సూచిస్తున్న టిప్స్ ఇప్పుడు పరిశీలిద్దాం.

రేంజ్

ఇంధనం లేదా బ్యాటరీతో ప్రయాణించే దూరమే రేంజ్. ఎలక్ట్రిక్ బైక్, స్కూటర్లలో ఎలాంటి ఇంధనం ఉండదు కాబట్టి రేంజ్ అనేది చాలా ముఖ్యం. ఇంధన వాహనం అయితే ఎక్కడైనా పెట్రోల్​ నింపుకునే వీలుంటుంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంలో ఈ సదుపాయం ప్రస్తుతానికి చాలా తక్కువ. నగరంలోపల ప్రయాణించే ఉద్దేశంతో అయితే 70 నుంచి 100 కిలోమీటర్ల రేంజ్ సరిపోతుందంటున్నారు నిపుణులు.

బ్యాటరీ నాణ్యత

ఎలక్ట్రిక్ బైక్, స్కూటర్ నాణ్యత అనేది బ్యాటరీ పైనే ఆధాపడి ఉంటుంది. ప్రస్తుతం చాలా కంపెనీలు లిథియం-అయాన్ బ్యాటరీలను ఉపయోగిస్తున్నాయి. ఇవి ఎక్కువ సేపు వాహనాన్ని నడిచేలా చూస్తాయి. వీటి జీవిత కాలం కూడా ఎక్కువ. మంచి నాణ్యత ఉన్న బ్యాటరీల వల్ల వాహనం పనితీరు కూడా మెరుగుపడుతుంది. లిథియం బ్యాటరీలు రెండు నుంచి ఆరు గంటల వ్యవధిలో ఛార్జ్​ అవుతాయి. అయితే లిథియం-అయాన్ బ్యాటరీ ఉన్న ఈ-స్కూటర్లు, బైక్​ల ధర మిగతా వాటితో పోల్చితే కాస్త ఎక్కువగా ఉంటుంది.

వాహన ఉపయోగం

పెట్రోలు లేదా ఎలక్ట్రిక్.. ఏ ద్విచక్రవాహనం అయినా ఉపయోగాన్ని బట్టి దాని ధర మారుతుంది. ప్రస్తుతం మార్కెట్లో పలు రకాల ఆప్షన్లు ఉన్నాయి. రోజువారీగా ఆఫీసుకు వెళ్లి రావడానికైతే.. ఒక విధమైన ఈ-బైక్, స్కూటర్ అవసరం అవుతుంది. అంతేకాకుండా ఇతర ఉపయోగాలకు ఎక్కువ సామర్థ్యం ఉన్న ఈ-బైక్ లేదా స్కూటర్ అవసరం అవుతుంది.

తక్కువ సామర్థ్యం ఉన్న స్కూటర్లు భారత్​లో అందుబాటులో ఉన్నాయి. ఈ-బైక్​లు కూడా వివిధ ధరల్లో ఉన్నాయి. కాబట్టి ఎలాంటి అవసరాలకు బైక్ ఉపయోగిస్తామనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ-బైక్​ను కొనుగోలు చేయాలి.

ధర

ముందు ధరను చూసి తర్వాత మన అవసరానికి సరిపోతుందా లేదా అనేది చాలా మంది చూస్తుంటారు. అయితే మార్కెట్లో ఉన్న ఈ-బైక్, స్కూటర్లను గమనించి అవసరానికి సరిపోయింది తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వివిధ ధరల స్థాయిలో వివిధ రకాల అవసరాలకు సరిపడా ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలు అందుబాటులో ఉన్నాయి.

టెస్ట్ డ్రైవింగ్

బైక్​లు, స్కూటర్లను కొనుగోలు చేసే ముందు టెస్ట్ డ్రైవింగ్ చేయాలి. టెస్ట్ డ్రైవింగ్ ద్వారా కొనుగోలుపై స్పష్టతతో పాటు నడిపించేటప్పుడు ఉండే అనుభూతిని ముందే తెలుసుకోవచ్చు. రోడ్ల పైన, అదే విధంగా మట్టి రోడ్​లో నడిపి సస్పెన్షన్, సామర్థ్యం వంటి విషయాలను గమనించవచ్చు.

వీటితో పాటు బ్యాటరీ సామర్థ్యం, మోటార్ సామర్థ్యం, సర్వీసింగ్ ఛార్జీలు, ఛార్జింగ్ సమయం, వారంటీ తదితర వివరాలను కొనుగోలు చేసే ముందు పరిగణనలోకి తీసుకోవాలి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.