బంగారం ధరలు కాస్త దిగొచ్చాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.62 తగ్గి రూ.43,502గా ఉంది. వెండి ధర కిలోకు రూ.828 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.48,146గా ఉంది.
రూపాయి బలపడడమే బంగారం ధర తగ్గుదలకు కారణమని విశ్లేషించారు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ తపన్ పటేల్. పసిడి ధర ఇంకా తగ్గే అవకాశమున్నా... కరోనా భయాలు వెంటాడిన నేపథ్యంలో క్షీణత పరిమితంగానే ఉందని వివరించారు.
అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 1,648 డాలర్లుగా, ఔన్స్ వెండి ధర 18.10 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి: రియల్మీ X ఐక్యూ: రెండు 5జీ స్మార్ట్ఫోన్లలో ఏది బెటర్?