ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్‌పై సూచనలు, సలహాలు స్వీకరించడం సహా ఆర్థిక వృద్ధిని పెంచే చర్యలపై ఆర్థిక వేత్తలు, వివిధ రంగాల నిపుణులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు సమావేశం కానున్నారు. వర్చువల్ మార్గంలో జరిగే ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్, సీఈఓ అమితాబ్ కాంత్ దాస్ కూడా పాల్గొంటారు.
"ఆర్థిక వేత్తలతో ప్రధాని నేడు సమావేశం కానున్నారు. వచ్చే నెల ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ పై సలహాలు, సూచనలు తీసుకోనున్నారు"
-ఓ ప్రభుత్వ అధికారి
కరోనా వల్ల తయారీ, సేవా రంగాలు దెబ్బతిన్న నేపథ్యంలో, 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.7శాతం క్షీణిస్తుందని భారతీయ రిజర్వు బ్యాంకు తోపాటు వివిధ సంస్ధలు అంచనా వేశాయి. ఈ క్రమంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
ఇదీ చూడండి: ఎల్ఐసీ పాలసీ పునరుద్ధరణకు మరో ఛాన్స్