బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి రేపు(శనివారం) మాక్ సెషన్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇందులో ఈక్విటీ, కమోడిటీ, కరెన్సీ డెరివేటివ్‌ల ట్రేడింగ్ జరగనుంది.
అన్ని సెగ్మెంట్ల ట్రేడింగ్ కోసం ఉదయం 9:30 నుంచి 10:00 గంటల మధ్య లాగ్ ఇన్ అవ్వాల్సి ఉంటుందని బీఎస్ఈ పేర్కొంది.
ఈక్విటీ డెరివేటివ్స్ మినహా అన్ని సెగ్మెంట్లలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3:30 గంటల ట్రేడింగ్ సాగనుంది. ఈక్విటీ సెగ్మెంట్లో రేపు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు ట్రేడింగ్ నిర్వహించనుంది బీఎస్ఈ.
మాక్ ట్రేడింగ్ సెషన్లు సాధాణంగా వారి వ్యవస్థ పనితీరును పరిక్షించేందుకు నిర్వహిస్తుంటారు. దోశ రహిత ట్రేడింగ్ చేసుకునేందుకు ఎక్స్చేంజి సభ్యులకు పటిష్ఠమైన వేదికను అందించే ప్రయత్నంలో ఈ ట్రేడింగ్ నిర్వహిస్తుంటారు.