కరోనా మహమ్మారి తెచ్చిన ఆర్థిక సంక్షోభం ధాటికి దిగ్గజ సంస్థలూ కుదేలవుతున్నాయి. ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ వార్షిక టర్నోవర్ తగ్గిన నేపథ్యంలో ఉద్యోగులను తగ్గించనున్నట్లు ప్రకటించింది. మొత్తంగా 6 వేలమంది ఉద్యోగులకు ముందస్తు పదవీ విరమణ ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.
"ముందస్తు పదవీ విరమణ అంశమై ఇప్పటికే ఉద్యోగుల ప్రతినిధులతో చర్చలు ముగిశాయి. పదవీ విరమణకు దగ్గరలో ఉన్న వారికి ఇది వర్తింపజేసేందుకు ఒప్పందం కుదిరింది. యువ ఉద్యోగులు ఉన్నత విద్య అభ్యసించేందుకు అవసరమైన ఆర్థిక సాయం అందించి.. అనంతర కాలంలో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇవ్వనున్నాం."
-బీఎండబ్ల్యూ ప్రకటన
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ మొత్తం ఉద్యోగుల్లో ముందస్తు పదవీ విరమణ చేయించాలనుకునేవారు 5 శాతంగా ఉన్నట్లు తెలిపింది సంస్థ. కరోనా సంక్షోభం కారణంగా ఐరోపా, ఇతర దేశాల్లో కొత్త కార్లకు డిమాండ్ తగ్గటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.
ఇదీ చూడండి:మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు