ETV Bharat / business

ఒక్క బిట్​కాయిన్ రూ.44.3 లక్షల పైమాటే!

బిట్​కాయిన్​ విలువ రోజు రోజుకూ సరికొత్త రికార్డు స్థాయికి చేరుతోంది. తాజాగా ఒక బిట్​కాయిన్​ విలువ తొలిసారి 60 వేల డాలర్లు దాటింది. గతనెల ఎదురైన ఒడుదొడుకులను దాటుకుని ఈ రికార్డు స్థాయికి చేరడం విశేషం. భారత కరెన్సీలో చెప్పాలంటే ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ విలువ రూ.44.3 లక్షలపైనే.

bitcoin new record
బిట్​కాయిన్​ విలువ కొత్త రికార్డు
author img

By

Published : Mar 14, 2021, 1:31 PM IST

క్రిప్టోకరెన్సీ సంచలనం బిట్​కాయిన్ మరో రికార్డు నెలకొల్పింది. ఒక బిట్​కాయిన్ విలువ తొలిసారి 60,000 డాలర్ల మార్క్​ దాటింది. శనివారం సాయంత్రానికి (అమెరికా కాలమానం ప్రకారం) 61,081 డాలర్ల వద్దకు చేరింది. భారత కరెన్సీలో ఈ విలువ దాదాపు రూ.44.3 లక్షల పైమాటే. ఫిబ్రవరిలో కాస్త ఒడుదొడుకులు ఎదుర్కొన్న బిట్ కాయిన్ తిరిగి రికార్డు స్థాయిలో పుంజుకోవడం విశేషం.

దాదాపు ఏడాది కాలంలో బిట్​కాయిన్ విలువ 1,000 శాతానికిపైగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా వివిధ కంపెనీలు బిట్​కాయిన్ లావాదేవీలను అధికారికం చేయడం, ఎలాన్ మస్క్, జాక్ డోర్సీ వంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలూ ఇందులో పెట్టుబడి పెట్టడం వంటి పరిణామాలు ఇందుకు కారణమయ్యాయి.

బిట్​కాయిన్ వృద్ధి ఇలా..

సంవత్సరంనెలవిలువ (డాలర్లలో)
2011ఫిబ్రవరి1
2011జూన్​10
2013ఏప్రిల్100
2013నవంబర్1,000
2017అక్టోబర్5,000
2017నవంబర్10,000
2017డిసెంబర్15,000
2020డిసెంబర్20,000
2020డిసెంబర్25,000
2021జనవరి30,000
2021జనవరి35,000
2021జనవరి40,000
2021ఫిబ్రవరి45,000
2021ఫిబ్రవరి50,000
2021ఫిబ్రవరి55,000
2021మార్చి60,000

ఇదీ చదవండి:బిట్​కాయిన్​ అంటే ఏంటి? ఎలా పని చేస్తుంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.