క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ విలువ రోజు రోజుకు రికార్డులను తిరగరాస్తూ దూసుకెళ్తోంది. తాజాగా దీని విలువ 40 వేల డాలర్ల (దాదాపు రూ.29.3 లక్షలు) మార్క్ దాటింది. డిసెంబర్లో తొలిసారి 20 వేల మార్క్ అందుకున్న బిట్‌కాయిన్ విలువ నెల రోజులు కూడా గడవకముందే రెండింతలవడం విశేషం.
బంగారంలానే.. క్రిప్టో కరెన్సీనీ మదుపరులు పెట్టుబడులకు సురక్షితంగా భావించడం ఈ స్థాయిలో బిట్‌కాయిన్ విలువ పెరిగేందుకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది.
బిట్‌కాయిన్ వృద్ధి ఇలా..
సంవత్సరం | నెల | విలువ (డాలర్లలో) |
2011 | ఫిబ్రవరి | 1 |
2011 | జూన్ | 10 |
2013 | ఏప్రిల్ | 100 |
2013 | నవంబర్ | 1,000 |
2017 | అక్టోబర్ | 5,000 |
2017 | నవంబర్ | 10,000 |
2017 | డిసెంబర్ | 15,000 |
2020 | డిసెంబర్ | 20,000 |
2020 | డిసెంబర్ | 25,000 |
2021 | జనవరి | 30,000 |
2021 | జనవరి | 35,000 |
2021 | జనవరి | 40,000 |
ఇదీ చూడండి:ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్