హైదరాబాద్‌లో జరిగే ప్రతిష్ఠాత్మక బయో ఏషియా సదస్సులో అంకురాలకు ప్రత్యేకించిన స్టార్టప్ స్టేజ్‌కు 300 దరఖాస్తులు వచ్చినట్లు గ్లోబల్ బయో ఏషియా ఫోరమ్ ప్రకటించింది. జనవరి 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఫార్మా, బయోటెక్, లైఫ్ సైన్స్, హెల్త్ కేర్, మెడ్ టెక్ రంగానికి సంబంధించి ఇన్నోవేటివ్ పరిష్కరాలను అందించిన మొత్తం 75 అంకురాలను ఈ కార్యక్రమం కోసం నిర్వహకులు ఎంపిక చేయనున్నారు.
సదస్సులో పాల్గొనే పారిశ్రామిక వేత్తల, పెట్టుబడిదారులతో వీరు భాగస్వామ్యం కోసం చర్చించే అవకాశం ఉండనుంది. అంతిమంగా 5 అంకురాలు 50 దేశాల ప్రతినిధుల ముందు ప్రదర్శించటంతో పాటు నగదు బహుమతిని పొందనున్నాయి. ఆసియాలోనే అతిపెద్దదైన ఈ లైఫ్ సైన్స్, ఆరోగ్య రంగ సదస్సుకు హైదరాబాద్ శాశ్వత వేదికగా ఉంది. ప్రస్తుత 17 వ విడత సదస్సు ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు జరగనుంది.
ఇదీ చూడండి: బయో ఆసియా 2020 'రేపటి కోసం నేడు'