ETV Bharat / business

17 నుంచి హైదరాబాద్​లో బయో ఆసియా సదస్సు

author img

By

Published : Feb 15, 2020, 7:17 PM IST

ఈనెల 17న హైదరాబాద్‌లో బయో ఆసియా సదస్సు ప్రారంభం కానుంది. మూడు రోజులపాటు సదస్సు జరగనుంది. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో పెట్టుబడులకు సదస్సు ఉపకరిస్తుందని మంత్రి కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

bio asia 2020 summit
bio asia 2020 summit

మరోరెండు రోజుల్లో హైదరాబాద్ వేదికగా బయో ఆసియా 17వ ఎడిషన్ సదస్సు ప్రారంభం కానుంది. తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వనున్న ఈ సదస్సు ఈనెల 17న ప్రారంభమై మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగంలోని పరిశోధకులు, తయారీదారులు, పెట్టుబడిదారులు, రాజకీయప్రముఖులు అందరినీ ఒక్కతాటిపైకి తీసుకురావటం ఈ సదస్సు ఉద్దేశం.

లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులను, గ్లోబల్ లీడర్స్​ను ఈ సదస్సు రాష్ట్రానికి తీసుకువస్తుందని పరిశ్రమలు, ఐటీ శాఖ మత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. సదస్సులో భాగంగా లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగం, డిజిటల్ హెల్త్, ఆరోగ్య రంగంలో నూతన ఆవిష్కరణలపై ఫలవంతమైన చర్చలు జరగనున్నాయి.

సంబంధిత కథనాలు: బయో ఆసియా 2020 'రేపటి కోసం నేడు'

బయో ఏషియా స్టార్టప్​ స్టేజ్​కు 300 దరఖాస్తులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.