రెండు కంపెనీల షేర్ల ద్వారా ఒక్క రోజులో రూ.వెయ్యి కోట్లకు పైగా లాభాన్ని గడించారు రాకేశ్ ఝున్ ఝున్ వాలా. ఆ రెండు కంపెనీలూ.. టాటా గ్రూప్‌నకు చెందినవి కావడం మరో విశేషం. రాకేశ్ ఝున్‌ఝున్ వాలాకు లాభాల వర్షం కురిపించిన ఆ రెండు కంపెనీల షేర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
'బిగ్బుల్' పంట పండించిన షేర్లు ఇవే..
టాటా గ్రూప్‌నకు చెందిన.. టైటాన్, టాటా మోటార్స్ కంపెనీల షేర్లు రాకేశ్ ఝున్‌ఝున్ వాలాకు రికార్డు స్థాయిలో లాభాలు తెచ్చి పెడుతున్నాయి.
టైటాన్ షేర్లు.. గురువారం సెషన్లో (బీఎస్ఈలో) 10 శాతం పుంజుకున్నాయి. దీనితో షేరు విలువ జీవనకాల గరిష్ఠమైన రూ.2,384.25 వద్దకు చేరింది. దీనితో కంపెనీ మార్కెట్ క్యాపిటల్ కూడా రూ.2 లక్షల కోట్లపైకి చేరింది. ఈ మార్క్ అందుకున్న రెండో టాటా గ్రూప్ కంపెనీగా నిలిచింది టైటాన్.
టాటా మోటార్స్ షేర్లు కూడా 12 శాతం పుంజుకుని.. 52 వారాల గరిష్ఠాన్ని తాకాయి. షేరు విలువ రూ.383 వద్దకు చేరింది. కేవలం ఈ రెండు షేర్లలో ఉన్న పెట్టుబడుల ద్వారానే రాకేశ్ ఝున్‌ఝున్ వాలా రూ.1,125 కోట్ల వరకు పెరిగింది.
ఝున్‌ఝున్ వాలా వాటాలు ఇలా..
ఏప్రిల్-జూన్ త్రైమాసిక గణాంకాల ఆధారంగా టైటాన్ కంపెనీలో బిగ్ బుల్.. 3,30,10,395 షేర్లు కలిగి ఉన్నట్లు తెలిసింది. ఆయన భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలా పేరుమీద 96,40,575 షేర్లున్నట్లు వెల్లడైంది. అంటే టైటాన్లో మొత్తం 4,26,50,970 షేర్లు ఝున్‌ఝున్‌వాలా దంపతుల పేరు మీదున్నాయి. టాటా మోటార్స్‌లో 3,77,50,000 షేర్లను రాకేశ్ ఝున్ ఝున్ వాలా కలిగి ఉన్నారు.
టైటాన్ షేర్లు ఒక్క రోజులో 10 శాతం అంటే.. ఒక్కో షేరు రూ.226.35 లాభపడింది. దీనితో 4,26,50,970 షేర్లకు గానూ.. రాకేశ్ ఝున్ ఝున్ వాలా దంపతులు రూ.965 కోట్ల లాభాన్ని గడించారు.
ఇక టాటా మోటార్స్ ఒక్క రోజులో రూ.42.45 పెరిగింది. దీనితో 3,77,50,000 షేర్లకు గానూ రూ.160 కోట్ల లాభాన్ని గడించారు బిగ్బుల్. కేవలం ఈ రెండు కంపెనీలక ద్వారానే ఒక్క రోజులో (రూ.965 కోట్లు + రూ.160 కోట్లు) రూ.1,125 కోట్ల లాభాన్ని ఆర్జించారు.
ఇవీ చదవండి: