Covaxin for children: భారత్ బయోటెక్ ఛైర్మన్, ఎండీ డా.కృష్ణ ఎల్లా.. వియత్నాం ఆరోగ్య శాఖ డిప్యూటీ మినిస్టర్ డా.ట్రాన్ వాన్ తువాన్తో సమావేశమయ్యారు. వియత్నాంలో 18ఏళ్లు లోపు పిల్లలకు కొవాగ్జిన్ టీకాను ఇచ్చే విషయంపై ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. దిల్లీలో శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో కృష్ణ ఎల్లాతో పాటు ఆయన సతీమణి, భారత్ బయెటెక్ జేఎండీ సుచిత్ర ఎల్లా కూడా పాల్గొన్నారు.
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన నాసల్ వ్యాక్సిన్‌పై వియత్నాంలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించే విషయాన్ని కూడా సమావేశంలో చర్చించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. భారత్ బయోటెక్ గ్రూప్ చేస్తున్న జంతు వ్యాక్సిన్ పరిశోధనలో పురోగతిని తెలుసుకోవడానికి వియత్నాం డిప్యూటీ హెల్త్ మినిస్టర్ ఆసక్తి కనబరిచినట్లు చెప్పాయి.
ఇదీ చదవండి: స్పుత్నిక్ లైట్ బూస్టర్‌తో 'ఒమిక్రాన్' దూరం