ETV Bharat / business

రుణ విముక్తికి ఎలాంటి ప్రణాళిక అవసరం? - రుణ విముక్తి పొందడం ఎలా

క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు.. ఇలా ఎప్పుడో ఒకసారి రుణాల అవసరం ఉంటుంది. అయితే రుణాన్ని తిరిగి చెల్లించటంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. కొందరైతే రుణ ఊబిలో చిక్కుకు పోతారు. అయితే రుణ విముక్తులు అయ్యేందుకు ఎలాంటి ప్రణాళికను అనుసరించాలి?

debt reduction strategies
రుణ విముక్తి విధానాలు
author img

By

Published : Jul 2, 2021, 8:42 AM IST

సాధారణంగా రుణం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా ఉంటుంది. ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక తరహాలో రుణాన్ని పొందుతుంటారు. ప్రస్తుత కాలంలో రుణాలు పొందటం చాలా సులువు. దీనితో ఎక్కువగా రుణాలు తీసుకోవటం సులువు అయింది. దీన్ని తీర్చటంలో ఇబ్బందులు పడుతుంటారు.

రుణ విముక్తులు కావాలంటే మొదటగా రుణాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. డ్యూ తేదీలు, అవుట్ స్టాండింగ్, వడ్డీ రేట్లు లాంటి పూర్తి వివరాలు నోట్ చేసుకోవాలి. దీనివల్ల ఏ రుణాన్ని త్వరగా చెల్లించాలి, ఏ రుణంలో ఎక్కువ చెల్లిస్తున్నాం తదితర వివరాలు తెలుస్తాయి.

వడ్డీ ఎక్కువున్న రుణాల వల్ల వ్యక్తిగత ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది. సాధారణంగా క్రెడిట్ కార్డులపై వడ్డీ చాలా ఎక్కువగా ఉంటుంది. వ్యక్తిగత రుణాల విషయంలో కూడా వడ్డీ ఎక్కువగానే ఉంటుంది. వడ్డీ ఎక్కువున్న రుణాల విముక్తి కోసం ప్రయత్నించాలి.

అవలాంచ్ స్ట్రాటజీ

వడ్డీ ఎక్కువున్న రుణాన్ని మొదట చెల్లించాలి. మిగతా వాటికి మినిమం పేమెంట్లు చేయాలి. ఇలా వడ్డీ ఎక్కువున్న రుణం పూర్తిగా చెల్లించిన అనంతరం మరో రుణంపై దృష్టి సారించాలి. క్రమక్రమంగా రుణాలన్ని తీరిపోతాయి. దీనిని అవలాంచ్ స్ట్రాటజీ అంటారు. ఈ పద్ధతి వల్ల ఎక్కువ వడ్డీ రుణాలు తగ్గుతూ వచ్చి.. అంతిమంగా రుణ విముక్తి పొందవచ్చు.

స్నో బాల్ స్ట్రాటజీ

రుణాన్ని తిరిగి చెల్లించే మానసిక స్థితి మెరుగుపడేలా.. తక్కువ అవుట్ స్టాండింగ్ మొత్తం ఉన్న రుణాన్ని తిరిగి చెల్లించేందుకు ప్రయత్నించాలి. మిగతా రుణాల విషయంలో కనీస పేమెంట్ చేయాలి. దీనివల్ల తక్కువ మొత్తం ఉన్నవి త్వరగా తీరి.. రుణ విముక్తి కావటంపై విశ్వాసం పెరుగుతుంది. ఈ స్ట్రాటజీ వల్ల రుణాల సంఖ్య తగ్గుతుంది. తదనంతరం పూర్తి రుణ విముక్తి కావొచ్చు. దీనినే స్నో బాల్ స్ట్రాటజీ అని అంటారు. ఈ వ్యూహం వల్ల వడ్డీ ఎక్కువ చెల్లించాల్సి రావొచ్చు.

ఉమ్మడిగా

ఇందులో పై రెండు వ్యూహాలను ఉమ్మడిగా అనుసరించాలి. చిన్న మొత్తం రుణాలను మొదట చెల్లించాలి. విశ్వాసం పెరిగిన అనంతరం వడ్డీ రేటు ఎక్కువున్న వాటిని తిరిగి చెల్లించేందుకు ప్రయత్నించాలి. విశ్వాసం సన్నగిల్లినప్పుడు మొదటి మెట్టు నుంచి మళ్లీ ప్రారంభించవచ్చు.

ఈ వ్యూహాలు ఆదాయాలు ఉండి రుణ ఊబిలో ఉండే వారికి సరిపోతాయి. ఆదాయం ఎక్కువగా లేని వారు జీవన శైలిలో మార్పు, ఇతర చర్యలు చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

జీవన శైలి మార్చుకోవాలి

రుణ విముక్తి కోసం ఎన్ని పద్ధతులు వాడినప్పుటికీ జీవన శైలిలో మార్పు తెచ్చుకోవటం అనేది తప్పనిసరని నిపుణులు సూచిస్తున్నారు. రెస్టారెంట్లలో తినటం, ఎంటర్​టైన్మెంట్​పై ఎక్కువగా ఖర్చు చేయటం లాంటివి తగ్గించుకోవటం వల్ల ఆ మొత్తాన్ని రుణ చెల్లింపుల కోసం ఉపయోగించుకోవచ్చు.

పెట్టుబడుల ఉపసంహరణ

పెట్టుబడులపై వచ్చే రాబడి కంటే రుణంపై చెల్లించే వడ్డీ రేటు ఎక్కువున్నట్లయితే.. పెట్టుబడులను ఉపసంహరించుకోవచ్చు. అయితే రుణ విముక్తులు అయ్యాక మళ్లీ పెట్టుబడులకు సంబంధించిన ప్రణాళికను కొనసాగిస్తుండాలి.

ఆటోమెటిక్ పేమెంట్లు

రుణ గడువు, క్రెడిట్ కార్డు బిల్లు గడువును ఎల్లప్పుడు గుర్తుంచుకోవటం కష్టమైన పనే. కాబట్టి వాటికి సంబంధించి ఆటోమేటిక్ పేమెంట్స్ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల గడువు ప్రకారమే చెల్లింపులు జరుగుతాయి. గడువు ప్రకారం పేమెంట్లు చేయటం అనేది చాలా ఉత్తమమైన విషయం. దీనికోసం ఆటోమెటిక్ పేమెంట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలి.

బీమా తీసుకోవాలి

ఒకవేళ సంపాదించే వ్యక్తి మరణించినట్లయితే కుటుంబం రుణ ఊబిలో కూరుకుపోకుండా ఉండేందుకు బీమా తీసుకోవటం ఉత్తమం.

ఇదీ చూడండి: టాప్‌-'అప్పు' కోసం రుణ బదిలీ మంచిదేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.