రూ.8 వేల లోపు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ కథనం మీకోసమే. బడ్జెట్లో.. రూ.8,000 లోపు మంచి ఫీచర్లు ఉన్న స్మార్ట్ఫోన్ల సమాచారం తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే..
రియల్మీ 3ఐ
8వేల లోపు ధర ఉన్న అత్యుత్తమ ఫోన్‌గా నిలిచింది రియల్మీ 3ఐ. 6.2 అంగుళాల డ్యూడ్రాప్ ఫుల్స్క్రీన్తో ఈ మోడల్‌ను తీసుకువచ్చింది రియల్మీ. ఇందులో 4230 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని పొందుపరిచారు. హీలియో పీ60 చిప్సెట్తో ఈ ఫోన్ పని చేస్తుంది. రెండు వెనుక కెమెరాలు(13 ఎంపీ, 2 ఎంపీ) ఉన్న రియల్మీ 3ఐ మోడల్.. 3 జీబీ ర్యామ్-32 జీబీ రామ్, 4 జీబీ ర్యామ్-64 జీబీ రామ్ వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. అయితే ఇందులో 3 జీబీ ర్యామ్ ఫోన్ ధర మాత్రమే రూ.8000 లోపు ఉంది.
ఇన్ఫినిక్స్ ఎస్4
మూడు వెనుక కెమెరాలు (13 ఎంపీ, 8 ఎంపీ, 2 ఎంపీ )తో రూ.10 వేల లోపు అందుబాటులో ఉన్న అతి తక్కువ ఫోన్లలో ఇన్ఫినిక్స్ ఎస్4 ఒకటి. ఎక్కువ బ్యాటరీ సామర్థ్యంతో పాటు ఈ ఫోన్ కెమెరా క్వాలిటీ హైలెట్‌గా నిలుస్తోంది. ఇన్ఫినిక్స్ ఎస్4 మోడల్ ఫోన్ చూడటానికి అందంగా ఉంటుంది. ప్రత్యేకించి నీలిరంగులోని ఫోన్ వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఇన్ఫినిక్స్ ఎస్4 మోడల్లో మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్‌ను పొందుపరిచారు. 6.21 అంగులాల పూర్తి హెచ్‌డీతో..3 జీబీ ర్యామ్-32 జీబీ రామ్, 4 జీబీ ర్యామ్-64 జీబీ రామ్ వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. 4,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్లో పొందుపరిచారు. అయితే ఇందులో 3 జీబీ ర్యామ్ ఉన్న ఫోన్ మాత్రమే రూ.8 వేల లోపు అందుబాటులో ఉంది.
యాసెస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1
రూ.8 వేల లోపు ధర జాబితాలో అత్యంత పాత మొబైల్ ఫోన్ యాసెస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1. అయినప్పటికీ.. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లున్న స్మార్ట్‌ఫోన్ కొనాలనే వారికి ఇది ఉత్తమ ఎంపికగా నిలుస్తోంది. ఇప్పటివరకు యాసెస్ ఫోన్లకు ఉన్న సాఫ్ట్వేర్ అప్డేట్ సమస్యనూ ఈ మోడల్లో అధిగమించారు. అందుకే ఇకపై ఈ ఫోన్ కొనేవారు ఆండ్రాయిడ్ 9-పై సేవలు పొందనున్నారు. అలాగే ఆండ్రాయిడ్ 10కు కూడా అప్డేట్ కానుంది.
మ్యాక్స్ ప్రో మోడల్ ఫోన్ కెమెరాతో తక్కువ వెలుతురులోనూ నాణ్యమైన ఫోటోలు తీసుకోవచ్చు. 3 జీబీ ర్యామ్-32 జీబీ రామ్, 4 జీబీ ర్యామ్-64 జీబీ రామ్ వేరియంట్లలో ఈ ఫోన్ మార్కెట్లో అందుబాటులో ఉంది. అయితే ఇందులో 3 జీబీ ర్యామ్ ఫోన్‌ను మాత్రమే రూ.8000 లోపు లభిస్తోంది.
ఇది కూడా..
రియల్‌మి, ఇన్ఫినిక్స్, యాసెస్తో పాటు రెడ్మీ 7ఏ కూడా తక్కువ ధరకే ఉత్తమ ఫీచర్లు అందిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. అందుకే పై మూడు ఫోన్లపై ఆసక్తి చూపని వారు రెడ్మీ 7ఏపై ఓ కన్నేయండి.
రెడ్మీ 7ఏ
బడ్జెట్ ఫోన్లో రెడ్మీ 7ఏ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. ఈ ఏడాది జులైలో విడుదలైన ఈ ఫోన్.. 2జీబీ ర్యామ్-32 జీబీ రామ్, 3 జీబీ ర్యామ్-32 జీబీ రామ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. అయితే ఇందులో 3 జీబీ ర్యామ్‌ను కొనుగోలు చేస్తేనే మంచిదని వినియోగదారులు భావిస్తున్నారు. 5.45 అంగులాల డిస్ప్లేతో ఫుల్హెచ్డీలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. 12 ఎంపీల వెనుక కెమెరా, 5 ఎంపీల సెల్ఫీ కెమెరాను ఈ ఫోన్లో పొందుపరిచారు.