ETV Bharat / business

Best investment plans: డిజిటల్‌ బంగారంతో లాభమేనా?

ఎవరైనా పెట్టుబడులకు మించి అధిక రాబడి రావాలనే కోరుకుంటారు. అయితే కొందరే ఆ లక్ష్యాలను చేరుకోగలరు. ఇంకొందరు.. ఎలాంటి పథకాల్లో ఇన్వెస్ట్​ చేస్తే.. ఎక్కువ ఆదాయం ఆర్జించవచ్చు? నష్టభయంతో కూడిన పెట్టుబడులతోనే ఇది సాధ్యమా? డిజిటల్‌ బంగారంలో పెట్టుబడి లాభమా? నష్టమా? వంటి అనుమానాలతో వెనకడుగు వేస్తారు. అటువంటివారి ప్రశ్నలకు నిపుణుల సమాధానం ఏమిటో చూద్దాం.

Best investment plans
Best investment plans
author img

By

Published : Dec 24, 2021, 12:24 PM IST

Best investment plans: రాబడిని రెట్టింపు చేసుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తారు. కానీ కొందరే ఆ లక్ష్యాన్ని చేరుకుంటారు. మరికొందరు పలు అనుమానాలతో రిస్క్​ చేయడానికి ఇష్టపడరు. ఎందులో పెట్టుబడి పెట్టాలి? ఎలా పెట్టాలి? నష్టపోతామా? అని ఆలోచిస్తారు. ఇంతకూ ఎందులో పెట్టుబడి పెడితే లాభాలు అధికంగా వస్తాయో? నిపుణులు అభిప్రాయాలేంటో తెలుసుకుందాం

నేను నెలకు రూ.10వేల వరకూ పెట్టుబడి పెట్టాలనే ఆలోచనతో ఉన్నాను. కనీస వార్షిక రాబడి 14 శాతం మించి రావాలంటే ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి? ఎంత కాలం మదుపు చేయాలి?

- అరుణ్‌

* అధిక రాబడి రావాలంటే నష్టభయంతో కూడిన పెట్టుబడులతోనే సాధ్యం. మీరు ఎంత మేరకు నష్టభయం భరించగలరు అనేది చూసుకోండి. ఈక్విటీ ఆధారిత పెట్టుబడులతో కొన్ని సందర్భాల్లో 14శాతానికి మించి రాబడి వచ్చింది. అయితే, కనీసం 7-10 ఏళ్లపాటు పెట్టుబడిని కొనసాగించినప్పుడే ఇది సాధ్యం. స్వల్పకాలంలో హెచ్చుతగ్గులు అధికంగా ఉంటాయని మర్చిపోవద్దు. క్రమానుగతంగా మదుపు కొనసాగిస్తూ ఉంటే.. దీర్ఘకాలంలో 12-15 శాతం వరకూ రాబడిని ఆశించవచ్చు. దీనికి మీరు మంచి పనితీరున్న డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లను పరిశీలించండి.

మా అమ్మ పేరుమీద సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ ఖాతాలో రూ.5లక్షలు జమ చేయాలని అనుకుంటున్నాం. దీనివల్ల ఎక్కువ లాభమా? డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసి, నెలకు కొంత మొత్తం తీసుకుంటే మంచిదా?

- స్వప్న

* సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీంపై 7.4శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది. వడ్డీని ప్రతి మూడు నెలలకోసారి చెల్లిస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, డెట్‌ ఫండ్లలో ఇంతకన్నా అధిక రాబడి వచ్చే అవకాశం కనిపించడం లేదు. కాబట్టి, సీనియర్‌ సిటిజన్‌ ఖాతాలోనే జమ చేయండి. ఈ పథకంలో అయిదేళ్లపాటు కొనసాగాలి. పెట్టిన పెట్టుబడికి సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. వచ్చిన వడ్డీని మొత్తం ఆదాయంలో కలిపి చూపించి, వర్తించే శ్లాబుల ఆధారంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

నా వయసు 43 ఏళ్లు. రూ.75 లక్షల మేరకు ఒక టర్మ్‌ పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఒకే బీమా సంస్థ నుంచి తీసుకోవచ్చా? రెండు సంస్థల నుంచి తీసుకుంటే ప్రయోజనమేమిటి?

- శ్రీకాంత్‌

* జీవిత బీమా పాలసీ విలువ ఎప్పుడూ వార్షికాదాయానికి 10-12 రెట్ల వరకూ ఉండేలా చూసుకోవాలి. బీమా తీసుకునే సమయంలో మీ వ్యక్తిగత, ఆరోగ్య, ఆర్థిక వివరాలు స్పష్టంగా తెలియజేయాలి. మంచి క్లెయిం చెల్లింపుల చరిత్ర ఉన్న సంస్థలనే బీమా కోసం ఎంచుకోవాలి. ఒకే సంస్థ ద్వారా బీమా తీసుకుంటే.. ఏదైనా సమస్య వల్ల ఆ సంస్థ బీమా క్లెయింను తిరస్కరిస్తే... ఇబ్బందులు వస్తాయి. రెండు సంస్థల నుంచి తీసుకున్నప్పుడు ఒకటి తిరస్కరించినా. రెండోది ఆమోదించే అవకాశం ఉంటుంది. కాబట్టి, రెండు సంస్థలను ఎంచుకోవడం ఉత్తమం.

ఇప్పుడు పలు సంస్థలు డిజిటల్‌ గోల్డ్‌ పేరుతో బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం కల్పిస్తున్నాయి కదా! వీటిని ఎంచుకోవడం మంచిదేనా? నష్టపోయే ప్రమాదం ఉందా?

- వెంకట్‌

* బంగారంలో పెట్టుబడికి ఇప్పుడు అనేక మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో డిజిటల్‌ గోల్డ్‌ ఒకటి. కనీసం రూ.100తోనూ ఇందులో పెట్టుబడి పెట్టేందుకు వీలుండటం వల్ల ఇది ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. బంగారం ధరల కదలికల ఆధారంగానే వీటిలోనూ లాభం లేదా నష్టం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక దృష్టితో పసిడిలో మదుపు చేయాలనుకున్నప్పుడు గోల్డ్‌ ఈటీఎఫ్‌ లేదా గోల్డ్‌ ఫండ్లను ఎంచుకోవడం మేలు.

- తుమ్మ బాల్‌రాజ్‌

ఇదీ చూడండి: మార్కెట్​ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే ఇలా చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.