విద్యుత్ కార్లు.. భవిష్యత్ అంతా వీటిదే అనడంలో సందేహం లేదు. ఇప్పటికే చాలా దేశాలు కర్భన ఉద్గారాలు తగ్గించేందుకు విద్యుత్ కార్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. టెస్లా వంటి కంపెనీలు విద్యుత్ కార్ల క్రేజ్‌ను మరింత పెంచాయి.
పెరుగుతున్న సాంకేతికత, మౌలిక సదుపాయాలతో వేగం, ప్రయాణించే దూరం సహా అనేక విషయాల్లో సంప్రదాయ పెట్రోల్, డీజిల్ కార్లకు విద్యుత్ వాహనాలు గట్టి పోటీనిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ వాహనాలకన్నా.. విద్యుత్ కార్ల నిర్వహణ ఖర్చులు చాలా తక్కువగా ఉండటం వల్ల చాలా మంది వీటిని కొనేందుకు మొగ్గు చూపుతున్నారు.
అయితే మన దేశంలో ప్రస్తుతం.. టెస్లా కార్లు ఇంకా అంతగా వినియోగంలోకి రాలేదు. ఇటీవలే కంపెనీ కార్యకలాపాలు ప్రారంభమైన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆ కార్లు అందుబాటులోకి వచ్చేందుకు కాస్త సమయం పట్టొచ్చు. అయితే మన దేశంలో టాటా, హ్యూందాయ్, ఎంజీ, బెంజ్ సహా పలు ఇతర కంపెనీలు విద్యుత్ కార్లను విక్రయిస్తున్నాయి. ఆ కార్ల ధరలు, ఇతర ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
జాగ్వర్ ఐ పేస్
- ఇది ఎస్, ఎస్ఈ, హెచ్ఎస్ఈ వేరియంట్లలో లభిస్తోంది.
- ధర - 1.05 కోట్ల నుంచి 1.12 కోట్లు
- రైడింగ్ రేంజ్ - 470 కిలోమీటర్లు
- టాప్ స్పీడ్ - గంటకు 200 కిలోమీటర్లు
- పూర్తి ఛార్జింగ్ టైమ్ - 8.5 గంటలు, స్పీడ్ ఛార్జింగ్‌తో 2 గంటలు
- సీటింగ్ కెపాసిటీ - 5
- పవర్(గరిష్ఠం) - 394.26 బీహెచ్పీ
- 4.8 సెకన్లలో సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
స్ట్రామ్ మోటార్స్ ఆర్3
- ధర - రూ. 4.50 లక్షలు
- రైడింగ్ రేంజ్ - 200 కిలోమీటర్లు
- టాప్ స్పీడ్ - గంటకు 80 కిలోమీటర్లు
- సీటింగ్ కెపాసిటీ - 2
- ఛార్జింగ్ టైమ్ - 3 గంటలు
- పవర్(గరిష్ఠం) - 20.11 బీహెచ్పీ
- 200 కిలోమీటర్ల రైడింగ్ రేంజ్ ఎలక్ట్రిక్ వాహనానికి ప్రస్తుతం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. 120 కిలోమీటర్లు, 180 కిలోమీటర్ల రేంజ్ వాహనాన్ని కూడా తీసుకురానుంది స్ట్రామ్ మోటార్స్.
మెర్సిడేస్ బెంజ్ ఈక్యూసీ
- ధర - 1.04 కోట్లు
- బ్యాటరీ - లిథియం అయాన్, 80 కిలోవాట్ అవర్
- రైడింగ్ రేంజ్ - 370-414 కిలోమీటర్లు(ఒక్క పూర్తి ఛార్జ్ తో)
- టాప్ స్పీడ్ - గంటకు 180 కిలోమీటర్లు
- సీటింగ్ కెపాసిటీ - 5
- పవర్(గరిష్ఠం) - 402.30 బీహెచ్పీ
హ్యూందాయ్ కోన ఎలక్ట్రిక్
- ధర - రూ. 23.96 లక్షలు
- బ్యాటరీ - లిథియం అయాన్, 39.2 కిలోవాట్ అవర్
- రైడింగ్ రేంజ్ - 452 కిలోమీటర్లు(ఒక్క పూర్తి ఛార్జ్ తో)
- టాప్ స్పీడ్ - గంటకు 167 కిలోమీటర్లు
- సీటింగ్ కెపాసిటీ - 5
- పవర్(గరిష్ఠం) - 134.1 బీహెచ్పీ
- ఇది సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని 5.1 సెకన్లలో అందుకుంటుంది.
ఎంజీ జెడ్ఎస్ ఈవీ
- ధర - రూ. 20.99 లక్షల నుంచి రూ. 24.18 లక్షలు
- బ్యాటరీ - లిథియం అయాన్, 44.5 కిలోవాట్ అవర్
- రైడింగ్ రేంజ్ - 419 కిలోమీటర్లు(ఒక్క పూర్తి ఛార్జ్ తో)
- టాప్ స్పీడ్ - 140 కిలోమీటర్లు గంటకు
- పూర్తి ఛార్జింగ్ టైమ్ - 6-8 గంటలు, ఫాస్ట్ ఛార్జింగ్
- సీటింగ్ కెపాసిటీ - 5
- పవర్(గరిష్ఠం) - 140.8 బీహెచ్పీ
- సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 9.7 సెకన్లలో ఈ వాహనం అందుకుంటుంది.
టాటా నెక్సాన్ ఈవీ
- ధర - 13.99 లక్షల నుంచి 16.56 లక్షలు
- బ్యాటరీ - లిథియం అయాన్, 30.2 కిలోవాట్ అవర్
- రైడింగ్ రేంజ్ - 312 కిలోమీటర్లు(ఒక్క పూర్తి ఛార్జ్ తో)
- టాప్ స్పీడ్ - 120 కిలోమీటర్లు గంటకు
- ఛార్జింగ్ టైమ్ - 60 నిమిషాలు( 0 నుంచి 80 శాతం)
- సీటింగ్ కెపాసిటీ - 5
- పవర్(గరిష్ఠం) - 127 బీహెచ్పీ
- ఈ కార్ సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని 9.9 సెకన్లలో చేరుకుంటుంది.
ఇవే కాకుండా మహీంద్రా ఈ వెరిటో, టాటా టిగోర్ ఈవీలు కూడా అందుబాటులో ఉన్నాయి. వివిధ కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే వాటికి సంబంధించిన ప్రకటనలు వెలువడ్డాయి. అవి మార్కెట్లోకి వస్తే వినియోగదారులు ఎంపిక చేసుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉండనున్నాయి.
ఇవీ చదవండి: