అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై ఆశలతో స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. దేశీయంగా కాస్త ప్రతికూల పరిస్థితులు ఉన్నా... మదుపర్లు వాటిని బేఖాతరు చేసి కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. భవిష్యత్‌లో వడ్డీ రేట్లు మరింత తగ్గించే అవకాశముందని గురువారం ఆర్బీఐ సంకేతాలు ఇవ్వడమూ లాభాలకు దోహదం చేసింది.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 61 పాయింట్లు లాభపడి 40 వేల 840 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 16 పాయింట్లు వృద్ధి చెంది 12 వేల 035 వద్ద ట్రేడవుతోంది.
లాభనష్టాల్లో..
భారతీ ఇన్ఫ్రాటెల్, రెడ్డీ ల్యాబ్స్, సన్‌ఫార్మా, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్ రాణిస్తున్నాయి.
ఎస్ బ్యాంకు, జీ ఎంటర్టైన్మెంట్, ఓఎన్జీసీ, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
రూపాయి
ప్రస్తుతం రూపాయి విలువ స్థిరంగా ట్రేడవుతూ ... డాలరుకు రూ.71.26గా ఉంది.
ఇదీ చూడండి: సంపన్నుల కోసం శాంసంగ్ లగ్జరీ స్క్రీన్.. ధర రూ.12 కోట్లు!