ETV Bharat / business

'ప్రభుత్వ రుణం వచ్చేలోపు అప్పుతెచ్చి మొదలుపెడతాం' - టీకా ఉత్పత్తులపై కొవిషీల్డ్​

ప్రభుత్వం మంజూరు చేసిన రూ.3వేల కోట్లు త్వరలోనే సీరంకు వస్తాయని అదార్​‌ పూనావాలా పేర్కొన్నారు. ఆ మొత్తం వచ్చేలోపు బ్యాంకుల నుంచి రుణాల రూపంలో సొమ్మును సేకరించి టీకా ఉత్పత్తిని వేగవంతం చేస్తామన్నారు.

poonawala, serum
'ప్రభుత్వ రుణం వచ్చేలోపు అప్పుతెచ్చి మొదలుపెడతాం'
author img

By

Published : Apr 22, 2021, 5:40 AM IST

Updated : Apr 22, 2021, 6:39 AM IST

కొవిషీల్డ్‌ టీకా ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు సీరమ్‌ సంస్థ త్వరితగతిన చర్యలు తీసుకొంటోంది. ప్రభుత్వం ప్రకటించిన రూ.3,000 కోట్ల రుణం చేతికి వచ్చేలోపు.. బ్యాంకుల నుంచి అప్పు తెచ్చి ఉత్పత్తిని వేగవంతం చేస్తామని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ అదార్‌ పూనావాలా తెలిపారు. మే 1వ తేదీ నుంచి 18ఏళ్లు పైబడిన వారందరూ టీకా వేయించుకొనేందుకు ప్రభుత్వం అనుమతించింది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. జులై నాటికి నెలకు 10 కోట్ల డోసులను ఉత్పత్తి చేయగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.

సీరంకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.3వేల కోట్లు త్వరలోనే వస్తాయని నమ్ముతున్నానని అదార్‌ పునావాలా పేర్కొన్నారు. ఆ మొత్తం వచ్చే వరకు వేచి ఉండకుండా.. బ్యాంకుల నుంచి రుణాల రూపంలో సొమ్మును సేకరించి ఉత్పత్తిని వేగవంతం చేస్తామన్నారు. ప్రభుత్వం నుంచి ఆ నిధులు ఈ వారంలో రావచ్చని భావిస్తున్నట్లు ఆయన ఆంగ్లవార్త సంస్థ ఎన్‌డీటీవీతో తెలిపారు. జులై చివరికి వరకు ప్రభుత్వం 'వ్యాక్సిన్‌ మైత్రి'నిలిపేయవచ్చన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎగుమతులపై దృష్టిపెట్టే అవకాశం లేదని ఆయన వివరించారు. జూన్‌-జులైలో ఎగుమతులు పునరుద్ధరించవచ్చన్నారు.

ప్రైవేటు మార్కెట్లో కొవిషీల్డ్‌ టీకాల ధరలను బుధవారం సీరం సంస్థ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక డోసుకు రూ. 400, ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 600 చొప్పున టీకాను విక్రయిస్తామని వెల్లడించింది. 'కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మా ఉత్పత్తిలో 50శాతం కేంద్రానికి, 50శాతం రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులకు అందజేయనున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక డోసుకు రూ. 400, ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 600 చొప్పున విక్రయిస్తాం. విదేశీ టీకాలతో పోలిస్తే మా వ్యాక్సిన్‌ ధరలు అందుబాటులోనే ఉన్నాయి' అని సీరమ్‌ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. వచ్చే రెండు నెలల్లో టీకా ఉత్పత్తిని మరింత పెంచి కొరతను అధిగమిస్తామని సంస్థ ఈ సందర్భంగా పేర్కొంది. 4, 5 నెలల తర్వాత రిటైల్‌ మార్కెట్లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.

ఇదీ చూడండి: కొవిషీల్డ్ టీకా ధర ప్రకటించిన సీరం

Last Updated : Apr 22, 2021, 6:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.