ETV Bharat / business

సమర్థ సంస్కరణలతోనే 'బ్యాంకు'కు మనుగడ! - సమర్థ సంస్కరణలతోనే బ్యాంకుకు మనుగడ!

గత కొన్ని ఏళ్లుగా వరుసగా బ్యాంకు కుంభకోణాల బాగోతాలు బయటపడుతున్నాయి. తాజాగా పంజాబ్​ మహారాష్ట్ర బ్యాంకు కుంభకోణం బ్యాంకుల విశ్వసనీయతపై అనుమానాలు లేవనెత్తేలా చేసింది. ఈ నేపథ్యంలో బ్యాంకు నిబంధనల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై సమగ్ర కథనం.

సమర్థ సంస్కరణలతోనే బ్యాంకుకు మనుగడ!
author img

By

Published : Oct 9, 2019, 4:29 PM IST

భారతావనిలో బ్యాంక్ అంటే ఒక నమ్మకం. దాన్ని నిలిబెట్టేలా పటిష్ట వ్యవస్థల నిర్మాణంలో దశాబ్దాల తరబడి ఘోర వైఫల్యాలు స్కాముల పాలులై కోరచాస్తున్నాయన్నది నిష్ఠుర సత్యం. నిరుడు ఫిబ్రవరిలో పంజాబ్​ నేషనల్ బ్యాంకుకు రూ. 14వేల కోట్లకు టోపి పెట్టిన నేరగాళ్ల బాగోతం బయటపడి గగ్గోలు పుట్టింది. దరిమిలా ఇన్​ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్(ఐఎల్​ఎఫ్), దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ల డొల్లదనం వెల్లడై భయ సందేహాలు ముమ్మరించాయి. తాజాగా మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, దిల్లీల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పంజాబ్​ మహారాష్ట్ర సహకార బ్యాంక్(పీఎంసీ) గుట్టుమట్లు రచ్చకెక్కి మరో భారీ కుంభకోణాన్ని కళ్లకు కడుతున్నాయి.

ఏ సహకార బ్యాంకునూ కుప్పకూలనిచ్చేది లేదని ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ భరోసా ఇస్తున్నా పీఎంసీ బ్యాంకు మాజీ ఎండీ గత నెల మూడోవారంలో బ్యాంకు వాస్తవ స్థితిగతుల్ని ఏకరువు పెడుతూ లేఖ రాశాకే రిజర్వ్ బ్యాంకు రంగంలోకి దిగింది, హౌసింగ్ డెవలప్​మెంట్ అండ్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (హెచ్​డీఐఎల్) సంస్థకు పీఎంసీ బ్యాంకు సాక్షాత్తు కామధేనువుగా మారిందని, ఆ రెండింటి మధ్య బిగిసిన బాదరాయణ బంధం ఎంత బలమైనదంటే, దివాలా తీసిన హెచ్​డీఐఎల్​కు బ్యాంకు నిధులే కల్పతరువుగా మారాయని మాజీ ఎండీ థామస్ నిజాలు కక్కేశారు.

బ్యాంకు ఆస్తుల్లో 70 శాతానికి పైగా అంటే రూ. 6500 కోట్లు హెచ్​డీఐఎల్​కే దోచిపెట్టిన వైనం, 21,049 నకిలీ ఖాతాలు తెరిచి దివాలా తీసిన సంస్థకు నిధులు ప్రవాహానికి దారులు పరచిన ఘోరం- దేశ సహకార బ్యాంకుల చరిత్రలోనే కనీవినీ ఎరుగనిది.రూ. 11,617 కోట్ల డిపాజిట్లతో చూపులకు ఏపుగా కనిపిస్తున్న పీఎంసీ బ్యాంకు ఏడెనిమిదేళ్లుగా దారితప్పినా, దొంగఖాతాలతో ఆడిటర్లు, ఆర్​బీఐ కళ్లు కప్పినా, ఎవరూ ఏ దశలోనూ పసిగట్టలేకపోవడం- నిఘా యంత్రాంగాలు నీరోడుతున్నాయనడానికే నిదర్శనం. ఇప్పటికే ఆర్​బీఐ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉన్న బ్యాంకుల జాబితాలో ఇరవై నాలుగోదిగా పీఎంసీ చేరడం సహకారంలోనూ అక్రమాల ఉరవడికి నిలువుటద్దం!

వాణిజ్య బ్యాంకుల కంటే రెండు శాతం అధిక వడ్డీ ఇస్తూ, పట్టణాలు, నగరాల్లోని మధ్యతరగతి మదుపరుల ఆశల పల్లకీని మోస్తూ విస్తరించే పట్టణ సహకార బ్యాంకుల నిర్వహణలో క్రమశిక్షణ కొరవడిన ప్రతిచోటా సంక్షోభమే రగులుతోంది.

తెలుగు గడ్డ మీదే భాగ్యనగర్, కృషి, వాసవి, శ్రావ్య, ఛార్మినార్, మెగాసిటీ వంటి సహకార బ్యాంకులు అర్ధాంతరంగా మూతపడటంతో పదిహేనేళ్ల క్రితం మదుపరుల హాహాకారాలు మిన్నంటాయి. సహకార బ్యాంకులు కుప్పకూలడానికి ఏయే జాడ్యాలు కారణమవుతున్నాయో తెలిసినా, వాటిని ఎలా పరిహరించాలన్ దానిపై పలు కమిటీలు విపుల సూచనలు అందించినా దిద్దుబాటు చర్యలు సమగ్రంగా పట్టాలకు ఎక్కక పోవడమే ఎక్కడికక్కడ అభాగ్య మదుపరుల ఉసురు పోసుకొంటోంది.

రాష్ట్రాల పనుపున సహకార రిజిస్ట్రార్, కేంద్రం పక్షాన ఆర్​బీఐ ఈ బ్యాంకులపై చలాయించే ఉమ్మడి నియంత్రణే పలు రకాల రుగ్మతలకు మూల కారణమవుతోందని కేంద్ర ప్రభుత్వం 2003లోనే గుర్తించింది. కేతన్ పరేఖ్ శ్రద్ధగా అంటుకట్టిన సెక్యూరిటీల మహా కుంభకోణానికి గుజరాత్​లోని మాధేపురా మర్కంటైల్ కో ఆపరేటివ్ బ్యాంక్ భ్రష్ఠ నిర్వాకాలే పుణ్యం కట్టుకున్నాయి. దాని నుంచి నేర్చిన గుణపాఠాలేమిటన్న ప్రశ్నకు ఈనాటికీ సమాధానం లేదు, రాదు! దాదాపు 130 చిన్న బ్యాంకులకు ఏమాత్రం తేడాపాడాలు వచ్చినా దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉండబోతోందో ఊహకందదు. రూ. 8400 కోట్ల రుణాలందించిన పీఎంసీ బ్యాంకు దేశంలోనే అతిపెద్ద సహకార బ్యాంకుల్లలో ఒకటిగా పేరెన్నికగన్నది. మదుపుదారులెవరూ నష్టపోని విధంగా ఈ సంక్షోభాన్ని పరిష్కరించడంతోపాటు, మరిన్ని కొలుములు అంటుకోకుండా కాచుకోవడమే ఆర్​బీఐ దక్షతకు పరీక్ష కానుంది.

ఆర్​బీఐ గణాంకాల మేరకు- 2005లో 1926గా ఉన్న పట్టణ సహకార బ్యాంకుల సంఖ్య నిరుటికి 1550కి దిగివచ్చింది. ఒకే జిల్లాకు పరిమితమై వందకోట్ల రూపాయల లోపు డిపాజిట్లుగల వాటిని టైర్​-1గా, పలు జిల్లాలకు విస్తరించి భారీ డిపాజిట్లు గల వాటిని టైర్-2గా గుర్తించిన ఆర్​బీఐ లెక్కల ప్రకారం- తొలి అంచెలో 69 శాతం, రెండో అంచెలో 31 శాతం బ్యాంకులున్నాయి.

పట్టణ సహకార బ్యాంకుల మొత్తం ఆస్తులు రూ. 5.6 లక్షల కోట్లు, డిపాజిట్లు రూ. 4.6 లక్షల కోట్లు, రుణ వితరణ రూ. 2.8 లక్షల కోట్లు! మొత్తం వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే సహకార బ్యాంకుల డిపాజిట్లు కేవలం నాలుగు శాతమే అయినా-వాటి ఉనికి, మనికి బ్యాంకింగ్ సేవలపట్ల ప్రజావిశ్వాసానికి సూచికనడంలో సందేహం లేదు. వరస వైఫల్యాలతో ఏపీలో పలు సహకార బ్యాంకులు కుదేలైన నేపథ్యంలో ఏర్పాటైన నరసింహమూర్తి కమిటీ ఎన్నదగిన సిఫార్సులెన్నో చేసింది. ఫైనాన్స్​ బ్యాంకింగ్, ఆడిట్ రంగాలకు చెందిన ముగ్గురు నిపుణులతో బ్యాంక్ నిర్వహణ పరిపుష్టం కావాలని, రుణ వితరణ మొత్తంలో డైరెక్టర్లు, వారి కుటుంబ సభ్యులు తీసుకొనేవి రెండు శాతానికి మించకుండా చూడాలని సూచించింది.

ఆర్​బీఐ తనవంతుగా కొన్ని సంస్కరణల్ని పట్టాలకెక్కించినా, పర్యవేక్షక యంత్రాంగాల కళ్లుగప్పే దుస్త్రంత్రాలు యథాపూర్వం సాగుతూనే ఉన్నయాని పీఎంసీ బాగోతం చాటుతోంది. ఈ పరిస్థితుల్లో సహకార స్ఫూర్తి సడలకుండానే ఎక్కడికక్కడ పటిష్ఠ బిగింపుల్ని చట్టబద్ధం చేసి, పర్యవేక్షక యంత్రాంగాల్ని పరిపుష్టీకరించాలి. అవినీతి మహిషాసుర మర్దనం సమర్థంగా జరిగినప్పుడే బ్యాంకుల పట్ల ప్రజావిశ్వాసం ఇనుమడించేంది!

ఇదీ చూడండి: 'ఆర్థిక మందగమన ప్రభావం భారత్​పైనే అధికం'

AP Video Delivery Log - 0300 GMT News
Wednesday, 9 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0127: Hong Kong Court AP Clients Only 4233832
Protest outside HK court for activist's appeal hearing
AP-APTN-0117: US CA Power Shutdown Preps Part KPIX - must credit; no access San Francisco/Oakland market; no use by US Broadcast Networks; no re-sale, re-use or archive; Part KGO -must credit; No access San Francisco; No access by US Broadcast Networks; No re-sale, re-use or archive 4233831
Calif. officials, residents brace for power cuts
AP-APTN-0110: UK Parliament Prorogued News use only, strictly not to be used in any comedy/satirical programming or for advertising purposes; Online use permitted but must carry client`s own logo or watermark on video for entire time of use; No Archive 4233830
UK parliament prorogued until 14 October
AP-APTN-0109: Hong Kong Hidden Healers AP Clients Only 4233829
ONLY ON AP Hidden healers treat HKong protesters
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.