ఈ నెల 3వ తేదీ నుంచి 17వరకు బ్యాంకులు ఇచ్చిన అప్పులు, డిపాజిట్లు పెరిగినట్లు ఆర్బీఐ తెలిపింది. అప్పులు 7.2 శాతం పెరిగి రూ. 100.05 లక్షల కోట్లకు చేరుకోగా.. డిపాజిట్లు 9.51శాతం వృద్ధి చెంది రూ.131.26 లక్షల కోట్లు అయినట్లు వెల్లడించింది. గతేడాది ఇదే కాలంలో బ్యాంకులు ఇచ్చిన అప్పులు రూ. 93.32 లక్షల కోట్లు ఉండగా.. డిపాజిట్లు రూ. 119.85 లక్షల కోట్లని తెలిపింది.
అర్బీఐ మరికొన్ని గణాంకాలు..
- నాన్-ఫుడ్ బ్యాంక్ క్రెడిట్ వృద్ధి 2018 డిసెంబర్‌లో 12.8 శాతం ఉండగా.. 2019 డిసెంబర్ నాటికి 7 శాతానికి తగ్గింది.
- సేవల రంగానికి రుణాలు 2018 డిసెంబర్‌లో 23.2 శాతం ఉండగా.. 2019 డిసెంబర్‌లో 6.2 శాతానికి పడిపోయాయి.
- వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాల పురోగతి 8.4 శాతం నుంచి 5.3 శాతానికి తగ్గింది.
- వ్యక్తిగత రుణాల వృద్ధి 2018 డిసెంబర్‌లో 17 శాతం ఉండగా.. 2019 డిసెంబర్‌లో 15.9 శాతానికి క్షీణించింది.
- జనవరి నెలలో పరిశ్రమల రుణ వృద్ధి 4.4 శాతం నుంచి 1.6 శాతానికి తగ్గింది.