ETV Bharat / business

వర్క్​ ఫ్రం హోంతో.. మెరుగైన బ్యాంకర్ల ప్రొడక్టివిటీ - Reliance Securities Ltd

కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ విధించింది ప్రభుత్వం. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వర్క్​ ఫ్రం హోం చేయించేందుకు అన్ని సంస్థలు మొగ్గుచూపాయి. అయితే బ్యాంకింగ్ రంగంలో వర్క్​ ఫ్రం హోం మంచి ఫలితాలు ఇచ్చినట్లు ఓ సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా బ్యాంకింగ్ ఉద్యోగులు వర్క్​ ఫ్రం హోంలో చురుకుగా పని చేసినట్లు ఈ సర్వే పేర్కొంది.

bankers-in-india-are-more-productive-working-from-home
వర్క్​ ఫ్రం హోంతో.. మెరుగైన బ్యాంక్​ ఉద్యోగుల ప్రొడక్టివిటీ
author img

By

Published : Jun 28, 2020, 8:36 PM IST

కరోనా వైరస్‌ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు చేయాల్సి వచ్చింది. అనివార్యంగా చాలా పరిశ్రమలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాల్సిందిగా ఆదేశించాయి. సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలో ఎప్పటినుంచో ఈ పోకడ ఉంది. ఆర్థిక, ప్రభుత్వ రంగ సంస్థలకు ఆ అవకాశమే లేదు. అయితే లాక్‌డౌన్‌ వల్ల తక్కువ మందితోనే బ్యాంకులు నడిచాయి. మిగతావాళ్లు ఇంటి నుంచే పనిచేశారు.

పనిలో చురుకుదనం పెరిగింది...

ఇంటి నుంచి పనిచేయడం వల్ల బ్యాంకింగ్‌, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల సిబ్బంది ప్రొడక్టివిటీ పెరిగిందని తెలిసింది. ట్రాఫిక్‌లో గంటల తరబడి ప్రయాణాల లేకపోవడం వల్ల ఉద్యోగులు చురుగ్గా పనిచేశారట. ‘జెఫరీస్‌ ఇండియా’నే తీసుకుంటే సగటున 60 మంది రోజుకు ఒక గంటను ఆదాచేశారు. 70 శాతం మంది పనితీరు మరింత పెరిగిందని ఆ సంస్థ తెలిపింది.

భారత్‌లో ఆర్థిక రంగ సంస్థలన్నీ ముంబయి కేంద్రంగా పనిచేస్తుంటాయి. దేశంలో కరోనా వైరస్‌ బెడద ఎక్కువగా ఉన్నది అక్కడే. అందుకే బ్యాంకులు, మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు పనితీరులో శాశ్వత మార్పులు తీసుకొచ్చేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నాయి. 70-90% మంది ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించాయి. ఈ విధానంతో ఆశించిన దానికన్నా ఎక్కువ ఫలితం వచ్చిందని పరాగ్‌ పారిక్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ సీఈవో నీల్‌ పారిఖ్‌ తెలిపారు. భవిష్యత్తులోనూ వారంలో 2-3 రోజులు బృందాల వారీగా ఇంటి నుంచే పని చేయించడంపై సంస్థలు దృష్టి సారిస్తున్నాయని వెల్లడించారు. ఉద్యోగులు ఇంటి నుంచి ఎలా పనిచేస్తారోనన్న ఆందోళన మాయమైందన్నారు.

రిలయన్స్ బాటా అదే..

సమీప భవిష్యత్తులో కరోనా ముప్పు తగ్గే అవకాశం లేకపోవడం వల్ల భౌతికదూరం పాటించేందుకు రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ కూడా ఇదే బాటలో పయనించనుందని తెలిసింది. ముంబయిలో రెండో వేవ్‌ వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నప్పటికీ తమకేమీ ఆందోళన లేదని ఆర్థిక సంస్థలు అంటున్నాయి. మున్ముందు వారంలో కొన్ని రోజులు ఇంటి నుంచి పనిచేయడం సరికొత్త సాధారణం కానుందని భావిస్తున్నారు.

ఇదీ చూడండి:అంతరిక్ష రంగంపై అంకురాల ఆసక్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.