ETV Bharat / business

మెగా విలీనాన్ని వ్యతిరేకిస్తూ 27న బ్యాంకు సంఘాల సమ్మె - BANKS STRIKE NEWS

ప్రభుత్వ బ్యాంకుల మెగా విలీనానికి వ్యతిరేకంగా రెండు ప్రధాన బ్యాంకు సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నెల 27న సమ్మె చేయాలని నిర్ణయించాయి.

BANKS STRIKE
విలీనానికి వ్యతిరేకంగా బ్యాంకు సంఘాల సమ్మె
author img

By

Published : Mar 5, 2020, 8:08 PM IST

10 ప్రభుత్వ బ్యాంకుల విలీనానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడానికి వ్యతిరేకంగా బ్యాంకు యూనియన్లు నమ్మెకు పిలిపునిచ్చాయి. ఈ నెల 27న సమ్మె నిర్వహించాలని రెండు ప్రధాన బ్యాంకు యూనియన్లు.. అఖిల భారత బ్యాంకు ఉగ్యోగుల సంఘం(ఏఐబీఈఏ), అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘం (ఏఐబీఓఏ) నిర్ణయించాయి.

సమ్మెకు కారణాలు..

ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనం ఏప్రిల్​ 1 నుంచే అమలులోకి వస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. మార్చి 4న మరోసారి స్పష్టం చేశారు. 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా కుదించాలని కేంద్రం గతేడాది ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్​ ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. విలీన విషయమై బ్యాంకులతో ఎప్పటికప్పుడు కేంద్రం మంతనాలు జరుపుతోందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి బ్యాంకుల బోర్డులు అన్ని రకాల నిర్ణయాలు తీసుకున్నాయన్నారు.

ఈ మెగా విలీనానికి నియంత్రణ పరంగా ఎలాంటి సమస్యలు లేవని సీతారామన్ స్పష్టం చేశారు. ఈ ప్రకటన నేపథ్యంలో బ్యాంకు యూనియన్లు సమ్మెకు పిలిపునిచ్చాయి.

మరింత సమాచారం కోసం: బ్యాంకుల విలీనానికి సర్వం సిద్ధం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.