కేంద్రం ప్రతిపాదించిన రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సోమ, మంగళవారాల్లో బంద్కు పిలుపునిచ్చాయి ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగుల సంఘాలు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రెండు రోజులు దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లు ప్రకటించాయి.
ప్రభుత్వ బ్యాంకు శాఖల్లో నగదు డిపాజిట్లు, విత్‌డ్రా చెక్కుల చలామణి, రుణాల మాంజురు వంటి సేవలు నిలిచిపోనున్నట్లు తెలిపాయి బ్యాంక్ సంఘాలు.
బంద్ నేపథ్యంలో బ్యాంకు సేవలకు ఏర్పడే అంతరాయం గురించి ఇప్పటికే ఎస్బీఐ సహా పలు బ్యాంకులు తమ ఖాతాదారులకు సమాచారమిచ్చాయి. సుమారు 10లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నట్లు తొమ్మిది బ్యాంకు సంఘాల సమాఖ్య (యూఎఫ్బీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది.