ఫిక్స్డ్ డిపాజిట్లు.. రిస్క్‌లేని, కచ్చితమైన ఆదాయాన్నిచ్చే పెట్టుబడి సాధనాలు. సాధారణంగా అన్ని బ్యాంకులు ఈ సదుపాయం కల్పిస్తాయి. అత్యవసరాలకు డబ్బు కావాల్సి వస్తే.. ఎఫ్డీ చేసిన బ్యాంక్‌నుంచి సులభంగా రుణం కూడా పొందొచ్చు. బ్యాంకులతో పాటు పోస్టాఫీస్ కూడా ఎఫ్డీ ఖాతాలను ఇస్తుంటుంది. (Bank FD vs post office FD)
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ, (Bank FD rates) పోస్టాఫీస్.. రెండింటిలో ఎఫ్డీ వడ్డీ రేట్లు ఎందులో ఎక్కువగా ఉన్నాయి? (Bank FD vs post office FD) ఇప్పుడు తెలుసుకుందాం.
పోస్టాఫిస్ ఫిక్స్డ్ డిపాజిట్‌పై వడ్డీ రేట్లు ఇలా.. (Post office FD interest rate 2021)
పోస్టాఫీస్ ఇస్తున్న బెస్ట్ ఆఫర్లలో.. ఎఫ్డీ వడ్డీ రేట్లు కూడా ఒకటని చెప్పుకోవచ్చు. కనీసం ఏడాది, గరిష్ఠంగా ఐదేళ్ల వరకు గడువుతో పోస్టాఫీస్‌లో ఎఫ్డీ చేయొచ్చు. ప్రస్తుతం పోస్టాఫీస్ ఎఫ్డీకి కనీసం 5.5 శాతం, గరిష్ఠంగా 5.7 శాతం వడ్డీ రేటు ఉంది.
కాలపరిమితి | వడ్డీ రేటు |
ఏడాది | 5.5 శాతం |
రెండేళ్లు | 5.5 శాతం |
మూడేళ్లు | 5.5 శాతం |
ఐదేళ్లు | 5.7 శాతం |
ఎఫ్డీపై ఎస్బీఐ ఇస్తున్న వడ్డీ రేట్లు ఇవే..
ఎస్బీఐలో అవసరాన్ని బట్టి 7 రోజుల నుంచి 10 సంవత్సరాల గడువుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు. ఇందులో కనీస వడ్డీ రేటు 2.9 శాతం నుంచి గరిష్ఠంగా 5.4 శాతం వరకు ఉంది.
కాలపరిమితి | వడ్డీ రేటు |
7-45 రోజులు | 2.9 శాతం |
46-179 రోజులు | 3.9 శాతం |
180-210 రోజులు | 4.4 శాతం |
210-365 రోజులు | 4.4 శాతం |
1-2 ఏళ్ల వరకు | 5 శాతం |
3-5 ఏళ్ల వరకు | 5.3 శాతం |
ఐదేళ్లు ఆపై.. | 5.4 శాతం |
ఇవీ చదవండి: బ్యాంకుల అదిరే ఆఫర్లు- తక్కువ వడ్డీకే హోంలోన్స్!