ETV Bharat / business

బ్యాంకు డిపాజిట్లు రూ.150 లక్షల కోట్లు - బిజినెస్ వార్తలు

బ్యాంకులకు ఇటీవల కాలంలో డిపాజిట్ల ప్రవాహం పెరిగడం వల్ల గత నెలాఖరు నాటికి డిపాజిట్ల మొత్తం రూ.150 లక్షల కోట్లను మించిపోయింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న బ్యాంకు డిపాజిట్ల మొత్తంతో పోల్చితే, ఈ మొత్తం దాదాపు 11 శాతం అధికం. ఆశ్చర్యకరంగా గత ఏడాది కాలంలో బ్యాంకు డిపాజిట్లు అనూహ్యంగా పెరగటంపై బ్యాంకింగ్‌ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

bank-deposits-crossed-rs-dot-150lakh-crores
బ్యాంకు డిపాజిట్లు రూ. 150 లక్షల కోట్లు
author img

By

Published : Apr 11, 2021, 5:30 AM IST

అక్షరాలా రూ.150 లక్షల కోట్లు. ఇదీ మన దేశంలో బ్యాంకుల వద్ద ఉన్న డిపాజిట్ల మొత్తం. బ్యాంకులకు ఇటీవల కాలంలో డిపాజిట్ల ప్రవాహం పెరిగింది. ఫలితంగా గత నెలాఖరు నాటికి బ్యాంకుల వద్ద ఉన్న డిపాజిట్ల మొత్తం రూ.150 లక్షల కోట్లను మించిపోయింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న బ్యాంకు డిపాజిట్ల మొత్తంతో పోల్చితే, ఈ మొత్తం దాదాపు 11 శాతం అధికం. ఆశ్చర్యకరంగా గత ఏడాది కాలంలో బ్యాంకు డిపాజిట్లు అనూహ్యంగా పెరగటంపై బ్యాంకింగ్‌ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. దీనికి ఎన్నో కారణాలను ఆ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి...

  • కొవిడ్‌-19 ముప్పు ఉన్నందున ప్రజల్లో ఎక్కువ మంది రిస్కు పెట్టుబడులను తగ్గించుకొని డిపాజిట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. డిపాజిట్లలో ఈ అనూహ్యమైన పెరుగుదల దాని ఫలితమే.
  • ఇటీవల కాలంలో బ్యాంకు డిపాజిట్లపై వడ్డీరేట్లు బాగా తగ్గాయి. ఒక ఏడాది బ్యాంకు డిపాజిట్‌పై 5 నుంచి 5.5 శాతం మాత్రమే వడ్డీ లభిస్తోంది. అయినప్పటికీ ఈ స్థాయిలో బ్యాంకు డిపాజిట్లు పెరగటం గమనార్హం.
  • మ్యూచువల్‌ ఫండ్ల నుంచి, కొంత మేరకు ఈక్విటీ షేర్ల నుంచి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఇటీవల కాలంలో ఉపసంహరించుకున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సొమ్ము బ్యాంకుల్లోకి వచ్చింది.
  • ప్రస్తుత వడ్డీరేట్లకు ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేస్తే పెద్దగా ఏమీ ప్రతిఫలం లేనట్లే. అయినప్పటికీ ప్రజల ముందు ఆసక్తికరమైన పెట్టుబడి అవకాశాలు లేక డిపాజిట్లతో సరిపెట్టుకుంటున్నారు.

డిపాజిట్ల సమీకరణలో ప్రభుత్వ బ్యాంకులతో ప్రైవేటు బ్యాంకులు సైతం పోటీపడటం ప్రత్యేకత. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఫెడరల్‌ బ్యాంకు, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు అధిక వృద్ధిని కనబరిచాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వద్ద డిపాజిట్లు 16.3 శాతం పెరిగాయి. ఫెడరల్‌ బ్యాంకు డిపాజిట్లు 13 శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు డిపాజిట్లు 27 శాతం పెరిగాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.