ETV Bharat / business

యాక్సిస్ బ్యాంక్ 'దీపావళి' బంపర్​ ఆఫర్లు​- 12ఈఎంఐలు రద్దు!

దీపావళి నేపథ్యంలో వినియోగదారులకు యాక్సిస్ బ్యాంక్ భారీ ఆఫర్లు (Axis Bank offers) ప్రకటించింది. ఎంపిక చేసిన హోమ్ లోన్లపై 12 ఈఎంఐలను మాఫీ (Axis Loan Offer) చేయనున్నట్లు వెల్లడించింది. ఆన్​లైన్ డీల్స్, డిస్కౌంట్స్, వాహనాల ఫైనాన్స్ సహా అనేక ఆఫర్లను తీసుకొచ్చింది.

axis fextive offers
యాక్సిస్ దివాళి ఆవర్
author img

By

Published : Oct 19, 2021, 8:49 PM IST

పండగ సీజన్ నేపథ్యంలో దిగ్గజ ప్రైవేట్ బ్యాంకు యాక్సిస్.. బంపర్ ఆఫర్లతో (Axis Bank offers) ముందుకొచ్చింది. ఎంపిక చేసిన హోమ్ లోన్లపై (Home Loan Offers) 12 ఈఎంఐలను రద్దు చేయనున్నట్లు తెలిపింది. దీంతో పాటు టూ వీలర్ కస్టమర్ల కోసం ఎలాంటి ప్రాసెసింగ్ ఫీ లేకుండా ఆన్​రోడ్ ఫైనాన్స్ సదుపాయం కల్పించనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఆన్​లైన్ కొనుగోళ్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది. (Axis Loan Offer)

వ్యాపారుల కోసం కూడా పలు ఆఫర్లను తీసుకొచ్చింది (Axis Bank offers) యాక్సిస్ బ్యాంక్. టర్మ్ లోన్లు, ఎక్విప్​మెంట్ లోన్లు, వాణిజ్య వాహనాల ఫైనాన్స్​పై అనేక ప్రయోజనాలు అందించనున్నట్లు తెలిపింది. యాక్సిస్ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా చేసే చెల్లింపులపై డీల్స్, డిస్కౌంట్స్ ఇస్తున్నట్లు వెల్లడించింది.

20 శాతం డిస్కౌంట్

50 నగరాల్లోని 2500 వ్యాపార కేంద్రాల్లో కొనుగోళ్లపై 20 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుందని (Axis Bank offers) వివరించింది. ఇందుకోసం ప్రముఖ బ్రాండ్లతో పాటు, లోకల్ రిటైలర్లతోనూ జతకట్టినట్లు వెల్లడించింది. దీపావళి పండగ నేపథ్యంలో తాజా డీల్స్ ప్రకటించింది యాక్సిస్. 'దివాళి ప్రతిరోజూ రాదు.. అందుకే మనస్ఫూర్తిగా సంబరాలు' చేసుకుందాం అంటూ చెప్పుకొచ్చింది.

ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30 రోజుల బోనస్‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.