ETV Bharat / business

'ఆటో' రంగంపై కరోనా సెగ- విక్రయాలు తగ్గేనా?

దేశంలో కరోనా కట్టడికి లాక్​డౌన్​ విధిస్తే కార్ల అమ్మకాలు, ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం ఉండొచ్చని ఆటోమొబైల్ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా వినియోగదారుల సెంటిమెంట్​తో అమ్మకాలు గణనీయంగా పడిపోతాయని భయపడుతున్నాయి.

author img

By

Published : Apr 19, 2021, 3:37 PM IST

Automakers fear
ఆటోమొబెల్​ అమ్మకాలపై ప్రభావం

కరోనా విజృంభణ నేపథ్యంలో కార్ల అమ్మకాలు పడిపోతాయని మారుతీ సుజుకి, టొయోటా, హోండా వంటి దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. లాక్​డౌన్ విధిస్తే కార్ల తయారీకి అవసరమైన ముడి సరకుల సరఫరాలో అతరాయం ఏర్పడుతుందని.. అదీగాక వినియోగదారుల మనోభావాలు దెబ్బతిని కొనుగోళ్లు తీవ్రంగా ప్రభావితం అవుతాయనని భావిస్తున్నాయి.

ఆటోమొబైల్​ అమ్మకాలు- ఆర్థిక వృద్ధి అనేవి పరస్పర సంబంధం కలిగి ఉంటాయని దేశీయ దిగ్గజ కార్ల ఉత్పత్తి సంస్థ మారుతీ సుజుకి పేర్కొంది.

''ఆటోమొబైల్​ అమ్మకాలు- ఆర్థిక వృద్ధి దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. అయితే ఇది వినియోగదారుల సెంటిమెంట్​కి అనుగుణంగా ఉంటుంది. కరోనా వల్ల కార్ల కొనుగోళ్లకు వినియోగదారులు మానసికంగా సంసిద్ధంగా ఉండరు.''

-మారుతీ సుజుకి

ఆయా రాష్ట్రాల్లో స్థానికంగా విధించే ఆంక్షల వల్ల కార్లను తరలించడం, డెలివరీ వంటి అంశాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయని టొయోటా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ సోని వెల్లడించారు. ఈ నెలాఖరు వరకు తమకు ఆర్డర్లున్నాయని.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉత్పత్తి కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు వివరించారు. ఉద్యోగుల శ్రేయస్సు, డీలర్లు, సరఫరా సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు.

"కచ్చితత్వంతో కూడిన ఉత్పత్తి, వేగవంతమైన డెలివరీ ద్వారా వినియోగదారులు వేచి ఉండే సమయాన్ని తగ్గించడంపైనే ప్రస్తుతం దృష్టి సారించాం. వినియోగదారులకు సులభతర, సౌకర్యవంతమైన సేవలు అందిచడమే మా ప్రధాన కర్తవ్యం."

-నవీన్ సోని, టొయోటా సీనియర్ వైస్​ ప్రెసిడెంట్

ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు హోండా కార్స్ ఇండియా తెలిపింది.

"లాక్​డౌన్, వారాంతపు కర్ఫ్యూలు అమ్మకాలపై ప్రభావం చూపుతాయి. వీటివల్ల కొన్నిచోట్ల షోరూమ్‌లు మూసివేయాల్సి వస్తుంది. ప్రస్తుతం వివిధ నగరాల్లోని పరిస్థితులను అంచనా వేస్తున్నాం."

-రాజేష్ గోయెల్, హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్​

ఇవీ చదవండి:

ఆన్​లైన్​లో 2 లక్షలకుపైగా మారుతీ కార్లు విక్రయం

కొత్త కారా.. కొన్నాళ్లు ఆగాల్సిందే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.