ETV Bharat / business

టాటా నయా ఈవీ.. హోండా సరికొత్త అమేజ్.. కియా ప్రాజెక్ట్​ ఎక్స్​ - tata electric car

కరోనా తర్వాత దేశంలో ఆటోమొబైల్ సందడి మొదలైంది. వివిధ కంపెనీలు కొత్త మోడళ్లను విడుదల చేస్తుండగా.. మిగతా సంస్థలు త్వరలోనే కొత్త వాహనాలను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నాయి. టాటా మోటార్స్​ తాజాగా విద్యుత్ వేరియంట్​ టిగోర్ కారును విడుదల చేసింది. ఈ కార్ విశేషాలతో పాటు.. ఇప్పటి వరకు ఉన్న ఆటో మొబైల్ అప్​డేట్స్ మీకోసం.

Auto mobile updates
ఆటో మొబైల్ అప్​డేట్స్​
author img

By

Published : Aug 18, 2021, 6:04 PM IST

దేశీయ ఆటోమొబైల్​ దిగ్గజం టాటా మోటార్స్ టిగోర్ విద్యుత్​ వాహనాన్ని (ఈవీ) బుధవారం ఆవిష్కరించింది. ప్యాసింజర్ వాహన విభాగంలో టాటా మోటార్స్ విడుదల చేసిన రెండో విద్యుత్ వేరియంట్ ఇది. నెక్సాన్​ మోడల్​ విద్యుత్ వేరియంట్​ ఈ కంపెనీ నుంచి వచ్చిన తొలి ఈవీ.

ఎంపిక చేసిన డీలర్ల ద్వారా రూ.21 వేలు చెల్లించి బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. బుక్ చేసుకున్న వారికి ఆగస్టు 31 నుంచి డెలివరీ చేసే అవకాశాలున్నాయి.

Tata tigor look
టాటా టిగోర్​ ఈవీ లుక్​

టిగోర్​ ఈవీ ఫీచర్లు..

  • 26 కిలో వాట్స్​ లీథియం అయాన్​ బ్యాటరీ
  • 55కిలో వాట్స్​ పవర్​ను, 170 ఎన్​ఎం టార్క్​ను విడుదల చేయగలదు
  • 0-60 కిలో మీటర్ల వేగాన్ని 5.7 సెకన్లలో అందుకునే సామర్థ్యం
  • ఎనిమిదేళ్లు/ 1,60,000 కిలోమీటర్లు పూర్తయ్యే వరకు బ్యాటరీ, మోటార్​కు వారంటీ
  • సౌకర్యవంతమైన సీటింగ్​ కెపాసిటీ
  • ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా వాడుకునే వీలున్న CCS2 ఛార్జింగ్ ప్రొటోకాల్​
  • ఎక్కడైనా 15A ప్లగ్​ పాయింట్​ ద్వారా ఫాస్ట్​, నార్మల్​ ఛార్జింగ్ సపోర్ట్​
  • రిమోట్​ కమాండ్స్, రిమోట్ డయాగ్నోసిస్​, మొబైల్ ఫోన్​ ద్వారా కార్​ను ఎప్పటికప్పుడు మానిటర్​ చేసుకునే సదుపాయం సహా 30కిపైగా కనెక్టెడ్ కార్​ ఫీచర్స్​ ఉన్నాయి.

హోండా అమేజ్​ కొత్త వేరియంట్​..

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హోండా.. కాంపాక్ట్​ సెడాన్ విభాగంలోని అమేజ్​ మోడల్​ అప్​డేటెడ్ వెర్షన్​ను మార్కెట్లోకి ఆవిష్కరించింది.

Honda Amaze updated version
హోండా అమేజ్​ అప్​డేటెడ్ వెర్షన్​

ఈ కొత్త మోడల్ ప్రారంభ ధరను (దిల్లీ ఎక్స్​ షోరూం) రూ.6.32 లక్షలుగా నిర్ణయించింది. గరిష్ఠ ధర రూ.11.15 లక్షలుగా ఉంచింది.

​1.2 లీటర్​ ఇంజిన్​తో పెట్రోల్ వేరియంట్​, 1.5 లీటర్ వవర్​ట్రైన్ సదుపాయంతో డీజిల్ వేరియంట్​ను అందుబాటులోకి తెచ్చినట్లు హోండా పేర్కొంది.

కారు విశేషాలు..

'పెట్రోల్ మోడల్​ మాన్యువల్ వేరియంట్​ లీటర్​కు 18.6 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. సీవీటీ వేరియంట్ మైలేజీ 18.3 కిలోమీటర్లు.

డీజిల్ మోడల్​ మాన్యువల్ వేరియంట్​ లీటర్​ ఇంధనంతో 24.7 కిలోమీటర్లు ప్రయాణించొచ్చని.. సీవీటి వేరియంట్ అయితే 21 కిలో మీటర్ల ప్రయాణించే వీలుంది' అని హోండా వెల్లడించింది.

ఎంజీ నుంచి ఆస్టోర్​..

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఎంజీ మోటార్స్ భారత మార్కెట్లోకి మిడ్​-సైజ్​ సెగ్మెంట్​లో కొత్త ఎస్​యూవీని తీసుకురానున్నట్లు బుధవారం ప్రకటించింది. అమెరికాకు చెందిన స్టార్​ డిజైన్​.. ఈ కార్​ను డిజైన్​ చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఆస్టోర్​ పేరుతో మార్కెట్లోకి ఈ కారును విడుదల చేయనున్నట్లు తెలిపింది.

MG Astor
ఎంజీ అస్టోర్​

తమ కొత్త మోడల్​ హ్యూందాయ్​ క్రెటా, కియా సెల్టోజ్​, స్కోడా కుషక్​, ఫోక్స్ వ్యాగన్​ టిగువాన్ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుందని కంపెనీ ధీమాగా ఉంది.

ఈ కొత్త కారు దీపావళికి మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ మోడల్​లో కృత్రిమ మేథ, లెవెల్ 2 అటానమస్​ డ్రైవింగ్ టెక్నాలజీ వంటి అధునాథన ఫీచర్లను ఉన్నట్లు ఎంజీ పేర్కొంది.

కియా నుంచి కొత్త మోడల్​..

దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్​ భారత మార్కెట్లోకి మరో కొత్త మోడల్​ను విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించి తాజాగా పలు వివరాలు వెల్లడించింది కియా. దీనికి ప్రాజెక్ట్​ ఎక్స్ అని పేరు పెట్టింది.

ఇందులో సెల్టోస్​ ఎక్స్​-లైన్​ ఎస్​యూవీ పేరుతో ఓ కొత్త మోడల్​ను తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఏడాది దిపావళి సందర్భంగా ఈ మోడల్ మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

భారత్​లో కియా కార్యకలాపాలు ప్రారంభించి ఈ నెల 22తో రెండేళ్లు పూర్తవనుంది. అదే రోజు ఈ కొత్త మోడల్ విశేషాలు సహా భారత్​లో కంపెనీ భవిష్యత్ ప్రణాళికను ప్రకటించే అవకాశముంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.